సీతా సమేతుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
ఆ సీతా సమేతుడు
నీలిమేఘశ్యాముడు
పితృవాక్య పరిపాలకుడు
ఏకపత్నీ వ్రతుడు ఆ శ్రీ రామచంద్రుడు
మానవుడై జనియించిన మాధవుడు
ముల్లోకాలకు ఆదర్శ పురుషుడు
మహోన్నత మనస్తత్వం గల దేవుడు
మన మదిని దోచిన సద్గుణ రాముడు
ఒక మంచి తనయుడిగా
ఒక మంచి సోదరునిగా
ఒక మంచి భర్త గా
ఒక మంచి అయోధ్య ప్రభువుగా
ఒక ప్రజాభీష్ట పాలకునిగా
ప్రజలను కన్న బిడ్డల వలే పాలించిన రాజుగా
భక్తులు కొలిచి
భక్తులు హృది మదిలో నిలిచిన దైవమా
అనంత సాగర హృదయమా
ఆచంద్ర తారార్కం నీ కీర్తి
అనంత విశ్వానికి నీవే స్ఫూర్తి
మరువదు మరిచి పోదు ఈ ధాత్రి