(అంశం :: “విమర్శించుట తగునా”)
మానిషి తత్వమే విమర్శించుట
రచన::బండారు పుష్పలత
మానవుడి నైజమ్ము విమర్శ ఏకదా..
మనిషి అనే పదంలోనే విమర్శ ఇమిడి ఉన్నది కదా.
మనిషి ముఖమున ఒక మాట
వెనుదిరిగి నాక ఒకమాట..
మని బాగా బ్రతికితే బలిశివుడంటారు..
ఏమి లేక పోతె గతిలేని వాడు అని..
ఆత్మభి మానముతో బతికితే
పొగరున్నోడు అన్నారు..
అందరితో కలిసి బ్రతికితే స్వతంత్రంగా బతుకలేడంటూ
అందగా వుంటే ఈర్షతో వుండేరు..
అందవిహీనంగాఉంటే ఎట్లా పాడైందంటారు..
వృత్తి దెగ్గర ఎంతో మంది తో ఎన్నో విమర్శలు…
వయసు ఏదైనా గాని విమర్శ మాత్రం ఒక్కటే.. లింగబేధములులేక విమర్శ
పలికేరు..
వున్నడు లేనోడుఎవ్వరికైనా సమానంగా పంచేది…
లోకంలో విమర్శలేని ప్రదేశం లేదు..
విమర్శించనిమహానుభావుడు లేడు..