పెద్దశిక్ష

పెద్దశిక్ష

రచన: పి. వి యన్. కృష్ణవేణి

మోసం అనేది చిన్న పదమే అవవచ్చుకానీ దానికి పెద్ద అర్దం ఉంది. అది మనసులో చెరగని ముద్ర వేస్తుంది.ఒక్కోసారి జీవితమే వ్యర్ధం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని నా నమ్మకం.

మోసగించడానికి పెట్టుకునే అందమైన పేర్లు చాలా ఉన్నాయి మన సమాజంలో. అవి ప్రేమ, స్నేహం, పెళ్లి, భంధుత్వాలు ఇలా చాలా.

మనలో ఉన్న బలహీనతలకు అనుగుణంగా ఆ పేరు మారుస్తారు మోసగాళ్ళు. వాళ్లకు బలి అయిన వాళ్ళు ఎంత మందో ఉన్నారు ఈ లోకం లో.

నా అనుభవమే మీకు ఒక చిన్నపాటి కథ అవుతుంది.

నా ప్రెండ్, కావ్య. చాలా తెలివైన, మంచి అమ్మాయి. కానీ, వీధి రాత తప్పించలేరనే నిజం ఇంకోసారి బయట పడింది.
ఆడుతూ పాడుతూ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేను పి.జీ. జాయిన్ అయ్యెందుకు  వెళ్లాను.

కావ్య మాత్రం, వాళ్ళ ఇంటి పరిస్తితిని అనుసరించి,  జాబ్ లో  జాయిన్ అయ్యింది. జాబ్ లో కూడా మంచి పేరు తెచ్చుకొని, అందరి ప్రశంసలు అందుకుంటూ తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ రాణించింది.

ఆ జాబ్ వర్క్లోనే తనతో పని చేసే ఉమెష్ తో లవ్ లో పడింది. చక్కగా జీవితాన్ని ఊహించుకొన్న కావ్య, డబ్బు పిచ్చితో పాటు, అన్ని అలవాట్లు ఉన్న వాడి నిజ స్వరూపాన్ని తెలుసుకుంది. అదీ పెళ్ళికి ముందే వాడి స్వరూపం తెలియడం వల్ల ఆనందంగానే ఉండేది.

కానీ, వాడు ఆ ఆనందం కూడా తను చూడలేక పోయాడు. జాబ్ చేసే చోట రకరకాలు గా ఇబ్బందులకు గురి చేసాడు. అవన్నీ తట్టుకుంటూ ఉండగా, వాళ్లు క్లోజ్ గా ఉన్నప్పటి ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. అంతే కాదు, రోజుకు ఒక ఫోటో ని అసభ్యంగా ఎడిట్ చేసి, కావ్య కి పంపించేవాడు.

ఇంకా, ఈ సంగతులు ఎవరికీ తెలియవు కాబట్టి పరువు పోక ముందే, ఎదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో, ఇంకో ఫ్రెండ్ సహాయంతో వాడి చీకటి ప్రపంచాన్ని వీడియో తీయటం మొదలు పెట్టింది.

ఆ వీడియో లలో,అటు అమ్మ నాన్నలకు, ఇటు జాబ్ లో కూడా అవకతవకలు చేసి దొరికిపొవటం వలన, వాడు ఇంకా కావ్య దారిలోకి వచ్చేశాడు.

కానీ, ఇంకా కావ్య ఆ ఆఫీసులో ఉండటం కరెక్ట్ కాదు అనిపించి, రిజైన్ లెటర్ రాసింది.

ఇంతలో ఆ రోజు ఆఫీసుకు వచ్చేసరికి, ఉమెష్ రాత్రికి రాత్రే, తన పరపతిని ఉపయోగించి, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టి, వెళ్ళిపోయాడు అని తెలిసింది.

ఇంకా కావ్య అయితే ఎగిరి గంతేసి, రిజైన్ లెటరుని చింపెసింది. మోసపోయిన చోటే మహా వృక్షం అయి ఎదిగింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!