బాస్ సలహా

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
బాస్ సలహా   
రచన: జీ వీ నాయుడు

రామి హైదరాబాద్ లో ఓ ప్రవేటు ఉద్యోగి. ఎమ్మెస్సీ వరకు చదివింది. తాను ఉద్యోగం చేసే ఆఫీసులో శ్యామ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ గా మొగ్గ తొడిగింది. అదివారాల్లో ఇరువురు సరదాలు, షికారుల్లో మునిగి తేలేవారు
.ఇలా కొన్ని నెలలు సరదా కాపురాలు సాగాయి.
రామి మెల్లగా పెండ్లి ప్రపోసల్ పెట్టింది. ఇక ఏముంది, ఇక్కడ నుంచి వారిలో వింత ధోరణలు మొదలయ్యాయి..
” నువ్వే నా ప్రాణం. నువ్వు లేనిదే నేను లేను. ఒక్క రోజూ నిన్ను చూడకుండా ఉండలేకున్నా. ఆఫీస్ కి కొంచం ఆలస్యం అయితే, నీకు ఏమైందో అనే వ్యాకులత నన్ను కలవర పెట్టించేది. పీరియడ్స్ టైం లో నువ్వు కడుపు నొప్పి అంటే నా బుర్ర వేడెక్కేది.” అని కబుర్లు చెప్పే శ్యాము మెల్ల మెల్లగా ముఖం చాటెయ్యడం ఆరంభం అయింది.
ఇలా కొన్ని రోజులు గడిచాయి.
నెలలో కనీసం ఒక్క రోజూ సెలవు పెట్టని శ్యాము, జీతం కట్ అవుతున్నా సెలవులు అధికంగా పెడుతున్నారు.
” ఇక లాభం లేదు. తాడో పేడో తేల్చుకోవాలి. ఆడ పిల్ల అంటే ఇంత అలుసా. పెండ్లి అనగానే ఇంత మార్పా. వీడిని ఇలా మామూలు గా వదలు కూడదు. వీడి అంతు చూస్తాను. నన్ను పెండ్లి చేసుకొని తీరాలి. లేదా వాడిని బ్రతికినంతకాలం నేనేంటి అనేది గుర్తుకు రావాలి ” అంటూ తనలో తానే కోపాగ్నితో రగిలిపోతుంది రామి. ఒక రోజు ఆఫీస్ లో పని చేయకుండా తన సీట్లో కూర్చొని ఆలోచన లో మునిగి పోయింది. ఇంత లో ఆ సంస్థ బిగ్ బాస్ అటుగా వెళ్తూ ” వాట్ హప్పెండ్ రామి ” అంటూ పలకరించేటప్పటికి తేరుకుంది. ” నో సార్, నథింగ్ హప్పెండ్. ” అంటూ బదులు ఇచ్చింది. కొద్దీ సేపు తమాయించుకొని బాస్ చేంబర్ లోకి వెళ్ళింది. ” సార్, మే ఐ కమిన్ ప్లీజ్ ” అనడం తో బాస్ ఒకే అన్నారు. ” ఏమీ లేదు సార్. ఇది ప్రవేటు విషయం. అయినా మీరు మాకు బాస్ కనుక తెలియజేయడం నా ధర్మం. నేను శ్యాం ప్రేమ లో పడ్డాము. బాగానే తిరిగాం. చివరికి మేరేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ముఖం చాటేస్తూ, ఆఫీస్ కు నామం పెడుతున్నాడు. నన్ను అన్యాయం చేస్తే అతను అంతు చూస్తాను సార్. మీరు ఏమీ అనుకోవద్దు. ఇలా చెప్పాను అని. ” తెగేసి చెప్పింది రామి. ” ఓసి నీ ఇల్లు బంగారం గాను, అతన్ని అంతు చూస్తే నీకేమి లాభం. ఏదో ఓ రకంగా మంచిగానే మేరేజ్ కి ఒప్పించు. ఇట్స్ గుడ్ ” అంటూ బాస్ నచ్చచెప్పాడు. మొత్తానికి బాస్ సలహా పాటించింది. కొంత కాలానికి ఇద్దరు ఒక్కటయ్యారు. సాఫీగా సాగుతుంది వారి జీవితం.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!