సద్విమర్శ అవసరమే..!

(అంశం :: “విమర్శించుట తగునా”)

సద్విమర్శ అవసరమే..!

రచన::అయిత అనిత

 ఏనాడూ కనిపించదు మనవెన్ను మనకు!
ఏ లోపం గోచరించదు మనలో మనకు!!
ఎవరికి వారు గొప్పవారే
ఎవరి చేతలు వాళ్లకు మంచివే
మరి.. తప్పులు తెలిసేదెలా?
ఒప్పులు జరిగేదెలా??

తప్పుల మూటను విప్పే స్నేహితుడు
సద్విమర్శ చేసే ఆత్మీయుడు అవసరమే సతతం!

నిలువెత్తు నిజాయితీ
నిజమైన నిస్పక్షపాతం
నీదరినుంటే విమర్శకూడా హితమే!
పదేపదే తప్పులెంచాలని చూడటం
పరుల మనసు గాయపరచడం
నీ నైజమైతే..
నీ విమర్శ వ్యర్థమే!

మంచిని ఆశించే మనసు
సహేతుకమైన యోచన
నీకు నేస్తమైతే…
విమర్శ ఎప్పుడూ ప్రయోజనకరమే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!