తెలిసి మసలుకోవాలి(కవితా సమీక్ష)

తెలిసి మసలుకోవాలి(కవితా సమీక్ష)

సమీక్ష: కనకరాజు గనిశెట్టి

కవితా శీర్షిక: తెలిసి మసలుకోవాలి
రచన: వి.వి.పద్మనాభ రావు (బాలపద్మం)

మొక్కకు నీళ్లు ఎక్కువ పోసినా
కుళ్ళి పోతుందిగా అలాగే
అతి అనేది ఎపుడూ చేటే అంటారు కవి
డబ్బులున్నప్పుడు చుట్టూ డప్పులు కొట్టే వారు
డబ్బుల కోసం చుట్టూ భజన చేసేవారు తారస పడుతూనే ఉంటారు
అలాంటి వారి
తలలు తెలుపైనా
తలపులు నలుపే అంటారు కవి
తనదైన శైలిలో చెప్పాలనుకున్న సందేశాన్ని సూటిగా తక్కువ వాక్యాల్లో పద్య పాదాన్ని తలిపించేలా చెప్పగలిగారు, వారి కలం నుండి మరిన్ని సందేశాత్మక రచనలు జాలువారాలని కోరుకుంటూ . .

ఎంత పరిధిలో ఉంటే అంత మంచిది అన్న వారి కవితా రచనను చూద్దాం..

తెలిసి మసలుకోవాలి
రచన: వి.వి.పద్మనాభ రావు (బాలపద్మం)

కాసులున్న నాడు పూసుకొనువారు
అధికారమున్న నాడు తాళమేయువారు
ఉన్నదూడినపుడు కానరారు !
తీపి కబురులెన్నో చెప్పువారు
నిన్నందలమెక్కించి పొగుడువారు
అవసరమవగానె మరి కానరారు !
ముఖము పైన నవ్వు పూసుకుని
బంధువులై మెలుగువారు
తలలు తెలుపైనా
వారి తలపులు నలుపే !
నీరు ఎక్కువ పోసినా
మొక్కలు కుళ్లిపోవుగా
అవసరానికి మించిన
లేదా నీ పరిధి దాటి చేసిన
సాయమెపుడు చేటే సుమా !
****************************

You May Also Like

6 thoughts on “తెలిసి మసలుకోవాలి(కవితా సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!