ఆధిపత్యపోరు (కవితా సమీక్ష)

ఆధిపత్యపోరు (కవితా సమీక్ష)

సమీక్ష: దోసపాటి వెంకటరామచంద్రరావు

కవితా శీర్షిక: ఆధిపత్యపోరు
రచన: ఈతకోట ఏడుకొండలు

ఆధిపత్యపోరు అను కవిత రాసినది ఈతకోట ఏడుకొండలు గారు. వృత్తిరిత్యా ఇస్రోలో పనిచేసి విశ్రాంతజీవితం గడుపుతున్నారు.సూళ్ళూరుపేట ఆయన నివాసం. ఆయన ప్రవృత్తి సాహిత్యాభిలాష. ఆ అభిలాషే ఆ తపనే అతనని ఎన్నో రచనలను చేసేలా ,వివిధ సామాజికసమూహాలలో పాల్గొనేలా చేసింది. ఆయన లెక్కకుమించి ప్రశంసలు సన్మాన సత్కారాలు పొందారు. ఎన్నెన్పో భావస్పూరకమైన ఉత్తేజకరమైన కవితలు ఆయన కలంనుండి వెలువడ్డాయి. అలాంటి ఆణిముత్యమే ఈ కవిత ఆధిపత్యపోరు.
ఈ కవితలో ఆయన ఆవేశం ఆయన భావనాతరంగాలు ప్రస్పుటికరించాయి. సమాజంపట్ల దేశం పట్ల ఆయన ఆవేదనను బహిర్గతం చేశాయి. ఒక
బాధ్యతగల పౌరునిగా తన ఆవేదనను ఆవేశాన్ని చాలా హృద్యంగా చిత్రీకరించారు.
ఆయన కవితలో మచ్చుకు కొన్ని వాక్యాలు:
మనుషుల్లో మానవత్వం మాయమై
పశుత్వం పడగవిప్పి బుసలు కొడుతూ
ప్రపంచాన్ని తన చేతుల్లో కీలుబొమ్మలాచేసుకొని
ఆధిపత్యపోరుతో
ఒకరిపైఒకరు
ఒకదేశంపై ఇంకోదేశం
ఆధిపత్యం చేయాలని
అర్ధంలేని ఉత్సాహంతో
కయ్యానికి కాలుదువ్వుతూ
యుద్దవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి”
దేశాలమధ్య వ్యక్తులమధ్య వైరం ఎలా పెరుగుతుందౌ తెలియజేశారు. అలాగే ఆధిపత్యపోరుతో అణుబాంబులను తయారుచేయడం, భయంకర రోగాలను ప్రభవించేలాచేస్తూ మానవమనుగడకు ముప్పు తెచ్చి పెడుతున్నాయని కూడ ఆవేదనను వ్యక్తం చేశారు.
బాధ్యతగలపౌరునిగా, సామాజికబాధ్యతగలవ్యక్తిగా ఒక హెచ్చరికను , ఒక సందేశాన్ని చివరగా ఇచ్చారు అదేమిటో చూడండి:
“విర్రవీగే ఓ మనిషి
ఇకనైనా కళ్ళుతెరూ
ప్రపంచశాంతికై పాటుపడు”

********************

ఆధిపత్యపోరు

రచన: ఈతకోట ఏడుకొండలు

మనుషుల్లో మానవత్వం మాయమై
పశుత్వం పడగ విప్పి బుసలు కొడుతూ
ప్రపంచాన్ని తన చేతుల్లో కీలుబొమ్మలా చేసుకోవాలని

ఆధిపత్య పోరుతో
ఒకరిపై ఒకరు
ఒక దేశంపై ఇంకొక దేశం

ఆధిపత్యం చేయాలని
అర్థంలేని ఉత్సాహంతో
కయ్యానికి కాలు దువ్వుతూ
యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి

అణుబాంబులతో బెదరింపులు
భయంకర అంటువ్యాధులను ప్రబలింప చేస్తూ
మానవాళి మనుగడకే ముప్పు తెస్తున్నాయి

ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని
కుటిల ప్రయత్నాలు చేసే కొన్ని దేశాలు
కడకు తన నెత్తిన తామే నిప్పులు పోసుకుంటున్నారని

ప్రకృతి తలచుకుంటే
ఎంతటి దేశాన్ని అయినా
మట్టి కరిపించి
ఒట్టి చేతులతో
భూస్థాపితం చేస్తుందన్న నిజాన్ని మరచి

విర్రవీగే ఓ మనిషీ
ఇకనైనా కళ్లు తెరువు
ప్రపంచ శాంతికై పాటుపడు
*********************

You May Also Like

One thought on “ఆధిపత్యపోరు (కవితా సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!