శ్రీరస్తూ.. శుభమస్తూ

శ్రీరస్తూ.. శుభమస్తూ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

స్మితకి  పెళ్లిచూపులలో పెళ్లి కోడుకును చూడగానే.”అరడుగుల  బుల్లెట్…”
పాట పాడుకోవాలనిపించింది. తరువాత ఆ సంబంధం కట్నకానుకలు దగ్గర తప్పిపోతే…
“ఆశ నిరాశే నా! జీవితాన్ని బతుకింతేనా!
అని మనసులో పాడుకుంది. తరువాత కొన్నాళ్లు ఏ సంబంధాలు రాక తండ్రి పడే కష్టాలు చూసి…
“జగమే మాయ!…
బ్రతుకే మాయ!…
జీవితాన బతుకు ఇంతేనయా!…” అంటూ బాధ పడింది. కొన్నాళ్లు గడిచేసరికి, తన  పెళ్లి కోసం పెళ్లికొడుకుల వేటలో తండ్రి పడే బాధ చూడలేక…
“ఏడ దాగున్నాడో బావా! అనుకుని మనసులో బాధపడే బదులు చదువుకుని, నాకాళ్ల మీద నేను నిలబడి, మా అమ్మనాన్నలకు అండగా ఉంటే, బాగుంటుంది కదా!!’ అనుకుని, తన తల్లిదండ్రులతో “నేను అపుడే  పెళ్లి చేసుకోను.  నాకు మరి ఏ సంబంధాలు చూడద్దని”  చెప్పేసి, చదువులో పూర్తిగా మునిగి పోయింది. వెళ్లిన చోట్టాల్ల అబ్బాయి తన వెంట పడి ప్రేమ అంటుంటే, ఇంత మందిని వెనక తిప్పుకునే తన అందం పెళ్లికి ఎందుకు పనికి రాలేదో తెలియక అయోమయంలో పడేది. తరువాత కాలేజీ అంత మందిలో టాప్ ర్యాంకు తెచ్చుకుంటే మరింత ఆత్మవిశ్వాసం పెరిగి, అందానికి,  చదువు కూడా తోడవడం వలన అందం మరింత వన్నె తేలింది. వయసు, చదువు తెచ్చిన ద్విగుణీకృతమైన అందంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. తన గురించి తెలిసిన గతంలో పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లికొడుకులు, మంచి సంబంధం వదులుకున్నట్లు ఫీల్ అయి విచారించారు. ఆ తరువాత “ముద్ద బంతి పూవులో మూగభాసలు! మూసుకున్న రెప్పలపై ప్రేమలేఖలు!
ఓ కోయిల మధుమాసం అవుతుంది అన్ని వేళలా.. ”
అంటూ..ఇంకా..హృదయమనే కోవెలలో…
నిను కొలిచానే దేవతగా..ఒక వెల్లువలా ”
అంటూ.  తన వెంట పడుతున్న స్మిత్ ని చూసి అతని స్వేచ్ఛమైన ప్రేమ తెలుసుకుని, మనసు పారేసుకుంది. ఆ తరువాత ఇద్దరూ కూడా ఒకరికి ఒకరూ చదువులో సాయం చేసుకుని, పై చదువు పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత  ఇద్దరూ క్యాంపస్ ఇంటర్వూ లో సెలక్టయి మంచి ఉద్యోగం లో సెటిలయ్యి, తమ పెళ్లికి పెద్దలను ఒప్పించి,  ఇరువైపులా పెద్దాలందరి ఆశీర్వాదంతో
“శ్రీరస్తు, శుభమస్తు అన్నది మన జంట.తధాస్తు తధాస్తు అనుకున్నది మన జంట…” అనుకుంటూ, ఘనంగా పెళ్లి చేసుకున్నారు. “ఏదలో తొలివలపే…
విరహం జత కలిసే..”అందం సింధూరం..అధరం   తాంబూలం..అసలే చలికాలం..””అనుకుంటూ ఇద్దరూ ఊటి బయలుదేరి వెళ్లి , ఊర్లో వింతలు, అందాలు అన్ని బాగా చూస్తూ, ఆ కొత్తదంపతులు తమ హాని మూన్ రోజులని చక్కగా ఎంజాయ్ చేసారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!