మోడుబారిన బ్రతుకు చిగురించిన వేళ

మోడుబారిన బ్రతుకు చిగురించిన వేళ

రచన: బుదారపు లావణ్య

అపురూపమైన అందచందాలతో అబ్బురపరిచే అలంకారంతో అద్భుతమైన కంఠస్వరంతో అలరించే ఆటపాటలతో అందాలొలికే అపురూపవతి అమర….

రామయ్య సీతమ్మల ఒక్కగానొక్క కుమార్తె తను చిన్నప్పటి నుండే ఎంతో చురుకైన అమ్మాయి అమర డిగ్రీ చదువుతుంది తను ఎప్పుడు చదువులో అందరికంటే ముందుండేది అందం చదువు తెలివితేటలు కలగలిసిన అమ్మాయి అమర….

తనతో పాటు కలిసి చదివే యువకుడు అజయ్ కి అమర అంటే చాలా ఇష్టం తనని ఎలాగయినా దక్కించుకోవాలని కోరికతో అమర ముందు మంచి వాడిలా నటిస్తూ ఉండేవాడు అజయ్…

మాయమాటలతో అమరకు దగ్గరై నా ప్రాణం నీ వంటూ ప్రేమనెంతోవలక పోస్తూ తన లోకాన్నే మరిపిస్తూ ఉండేవాడు అజయ్ అమర మదిలో ఆశలెన్నో పుట్టించి సంతోష సాగరంలో సకలం తనే అని బ్రమసేలా చేసి చివరికి కన్న వాళ్లను సైతం మరిచి తనతో కలసి పారిపోయి పెళ్లి చేసుకునేలా చేశాడు అజయ్….

పెళ్లి పేరుతో సర్వస్వం దోచుకొని మోజు తీరగానే మొహం ముట్టినట్టు తనని నిర్ధాక్షణ్యంగా వదిలేసి తన దారి తాను చూసుకున్నాడు అజయ్….

ఎంతో ప్రేమగా తనతో జీవితాన్ని ఊహించుకున్న అమర ఆశలన్నీ ఆవిరైపోయి కలలన్నీ కళ్ళలై కన్నీటిపర్యంతమై అలమటించు వేళ కడుపు తీపితో కన్నవారు దగ్గరై గతించిన కాలంలో గాయాల్ని తుడిచివేయడానికి తనను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వరుడితో మరల వివాహం చేసి మోడుబారిన అమర జీవితాన్ని మరలా చిగురించేలాచేశారుఅమర తల్లిదండ్రులు అయిన రామయ్య సీతమ్మ.
*********
ప్రేమ పేరుతో జీవితాలను బలి చేసుకుంటున్న యువతులుకు అమర జీవితమే ఒక గుణపాఠం.

—-

You May Also Like

One thought on “మోడుబారిన బ్రతుకు చిగురించిన వేళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!