మగువ మనస్సు దోచిన మన్మధుడి ప్రేమ బాణం

అంశం: మన్మథ బాణం

మగువ మనస్సు దోచిన మన్మధుడి ప్రేమ బాణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యల్. నిర్మల

మనలో చాలా భావాలు ఉంటాయి..
ఆ భావాలు కలిసి..
ప్రయాణం చేసే వారి  ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.
అలాంటి వారు
తారసపడడం అరుదు.
ప్రతి మనిషికీ జీవితంలో కొన్ని అరుదైన క్షణాలు ఉన్నట్లే
కొన్ని అమరమైన సమయాలూ తారసపడతాయి.
అది ఎలా అంటే…
ఆకలి వేసినా తినడానికి తిండి లేకపోవడం దరిద్రం.
తినడానికి అన్నీ ఉన్నా ఆకలి లేకపోవడం అనారోగ్యం.
తినడానికి ఉండి ఆకలి కూడా ఉండి ఆకలి లేదని
అబద్ధం చెప్పడం దురదృష్టం.
మరి అదృష్టం ఎలాగో చెప్పనా.
మగువ మనస్సు దోచిన మన్మధుడి ప్రేమ(బాణం)తో.
ఆకలి లేదు అని అబద్ధం చెప్పినా
ఆకలి తెలుసుకుని ప్రేమగా తినిపించు
మన్మధుడు  దొరకడం అదృష్టం…కదా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!