ఎండమావులు

ఎండమావులు

రచన:: అయిత అనిత

“సారీ..! రాధా!!” తప్పైపోయింది నన్ను క్షమించవూ!.”
” అదేంటి ? గోపి” అలా అనేసావు?. “నేనెలా కనిపిస్తున్నాను నీకు?” నేనెప్పటికీ గుండెల్లో గుడికట్టుకొని అందులో నిన్నే నిలుపుకొని ధ్యానించే నీ ప్రేయసినే గోపి”. “నన్ను నువ్వెంత దూరం పెట్టినా,ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూనే ఉన్నాను” అన్న రాధలోని నిజమైన ప్రేమను చూసి పశ్చాత్తాపం తో కళ్లు తడిబారాయి గోపికి.

“అవును నేనెంతపెద్ద తప్పు చేసాను. ఆస్తి అంతస్తుకై ఆశపడి కల్పన చుట్టూ పిచ్చోడిలా తిరిగాను” నన్ను అత్యంత ప్రేమగా చూసుకొనే రాధకు “ఇంతటి ద్రోహం ఎలా చేయగలిగాను” అని లోలపలే సిగ్గుపడ్డాడు గోపి తను చేసిన పిచ్చిపనికి.

రాధ,గోపీలు బావామరదళ్లు. చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. ఇద్దరి అభిరుచులు ఒకటే అవడం మూలానో, కలసి ఎక్కువ సమయం గడపడం మూలానో గానీ ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఏర్పడింది. అది పెద్దల సహకారంతో పెళ్లి వరకూ వచ్చింది. ఈ లోపలే గోపీకి పట్నంలో ఉద్యోగం రావడంతో గోపి పట్నం వెళ్లాడు. అక్కడ కంపెనీలో తనతోపాటే పని చేస్తున్న కల్పన చాల ఆస్తిపరురాలు. కావలసినంత డబ్బున్నా ఉద్యోగం చేయలన్న కోరికతో గోపి పనిచేసే ఆఫీసులోనే పనిచేస్తుంది.

“కల్పన చాలా చురకైంది మరియు ఫ్యాషన్ గా ఉంటుంది.” కొద్దిరోజుల్లోనే ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. గోపికి మెల్లమెల్లగా కల్పనపై ఇష్టం పెరగడం ప్రారంభమై అది ప్రేమదాక వచ్చింది. కల్పనపై మోజుతో గోపి, రాధను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు.
ఒక రోజు..
“కల్పన! ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావోయ్..” అంటూ మాటకలిపాడు గోపి. “అవునా! ఏంటి ఇది కొత్తగా పొగడటం నేర్చుకున్నావ్. ఏంటి? సంగతి!” అంటూ ఆరా తీసింది కల్పన.

“నీతో ఉన్న చనువుతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగనా?” అన్నాడు గోపి.
“హా! అడుగు!! ఆలస్యమెందుకు” అన్నది కల్పన.

గోపి: “నేను..నేను..”
కల్పన: “హా! నువ్వు నువ్వు.. ఏంటో చెప్పు సూటిగా”
గోపి: “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” మనం పెళ్లిచేసుకుందామా?”
కల్పన: “పిచ్చి గోపి నా చనువు నీకు ప్రేమలా కనిపించిందా?” “మరి నీ మరదలు సంగతేంటి?
గోపి: అదొక బుద్దావతారం అందుకే వదిలేసా!
“నువ్వు నేను సరి జోడి మనిద్దరం పెళ్లిచేసుకుంటే జీవితం హుందాగా ఉంటుంది”.
కల్పన: “మా బావ అమెరికాలో కోటీశ్వరుడు . తనతో నా పెళ్లి ఫిక్స్ అయ్యింది. వచ్చేనెలలోనే మాపెళ్లి నువ్వు తప్పకుండా రావాలి.”

ఆ మాటలు విన్న గోపికి తనకు కలిసి వచ్చిన అదృష్టం రాధను కాదనుకొని ఎండమావుల(కల్పన) వెంట పరుగెత్తానని అర్థం అయింది.

వెంటనే రాధను క్షమాపణ అడగడం,రాధ తన బావ ప్రేమను అంగీకరించడం జరిగిపోయాయి.
“దక్కిన దానితో తృప్తిపడక అందని ఎండమావులకై ఆశపడితే నిరాశే ఎదురవుతుంది”.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!