రక్షణ

రక్షణ

రచన శ్రీదేవి విన్నకోట.

ఆడపిల్లలకు రక్షణ కరువైన దేశంలో ఈ రోజున
ప్రతి క్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్న క్షణాన
ఎటువైపు నుంచి ఏ మానవ మృగం కాటేస్తుందొ
తెలియని సమయాన
అడుగడుగున అపనమ్మకం ప్రతి నిమిషం ఆవేదన
గుండె ధైర్యం కూడగట్టుకుని
తన కళ్ళనే కంచెగా కాపలాగా మలచి
తన చుట్టూ అణువణువును ప్రతిక్షణం పరిశీలిస్తూ
పరిసరాలను పరికిస్తూ
విధిలేని పరిస్థితులలో ఆదుర్దాగా జీవిస్తూ
లేనిపోని భయాలను అనుక్షణం మూట కట్టుకుంటూ
ఏదో జరగరానిది జరిగిపోతుందని ఆశిస్తూ
రోజు రోజుకి బ్రతుకు మీద ఆశను కోల్పోతూ
జీవచ్చవంలా జీవిస్తున్న ఆడపిల్లలు ఎందరో మరెందరో
అలాంటి వారందరికీ మానవ భక్షకులు నుండి
మనదేశంలో అతివలకు తక్షణ రక్షణ కావాలి.
అదే నేటి మహిళ గా  ఈనాటి నా చిన్న కోరిక.
తీరుతుంది అనే ఆశతో సెలవిక.

You May Also Like

One thought on “రక్షణ

  1. చాలా బాగా రాశారు శ్రీదేవి గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!