అన్వేషణ

అన్వేషణ

రచన -దాకరపు బాబురావు

నీకోసం నిరంతర అన్వేషణ కొనసాగుతూనేఉంటుంది…

పోగొట్టుకున్నదాన్నివెతుక్కోవటంలో
ఉన్న తెలియని ఆనందం
రోజూ మొగ్గై వికసిస్తూనే ఉంటుంది….

అప్పుడప్పుడుదిగులు మేఘం మనసావరణాన్నిఆక్రమించినట్లేఉంటుంది
కానీ, ఆశల పూలు వికసిస్తూనే ఉంటాయి…

వెతుకులాటలో డస్సిన హృదయానికి
నీ జ్ఞాపకాల జలపాతం నను నిజంగాతెప్పరిల్లజేసే ఒయాసిస్సే…

అనుక్షణంనీ ఆలోచన్ల వర్షం జడి వానై నను
తడిపేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటుంది…

నిట్టూర్పుల చూరు నుండి
నీ తలపుల్ని బొట్లు బొట్లుగా
హృదయం రాల్చుకుంటూనే ఉంటుంది

అందమైన నీ రూపం ఊరించే ఊహై
అందని సీతాకోకచిలుక లా ఎగురుతూ
నా చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది…

హృదయాన్ని తెరిపిన పడనివ్వని ఆశ
అన్వేషణా కాగడా వెలిగించుకుని
నీకోసం పయనాన్ని కోనసాగిస్తూనే ఉంటుంది ….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!