జాతిపిత

జాతిపిత

రచన -సంజన కృతజ్ఞ

గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. భారతదేశానికి స్వాతంత్రము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.

ప్రజలు అతన్ని మహాత్ముడని
జాతిపిత అని గౌరవిస్తారు.
సత్యము అహింసలు గాంధీ
నమ్మే సిద్ధాంత మూలాలు.

పిరికివారు ఎవ్వరినీ
క్షమించలేరు… కానీ
ధైర్యవంతులు ఎవరినైనా
క్షమించగలరు…

మురికివాడలు శుభ్రం చేసి
అన్ని మతాలూ, కులాలూ
ఒకటే అని చాటాడు.
హిందువులు , ముస్లింలు,
సిక్కులు , క్రైస్తవులు
ఇరుగు పొరుగులుగా ఉన్న
దేశాన్ని మతప్రాతిపదికన
విభజించడాన్ని గాంధీ తీవ్రంగా
వ్యతిరేకించాడు.

అలాంటి ఆలోచన సామాజికంగానూ, నైతికంగానూ ,
ఆధ్యాత్మికంగాను కూడా గాంధీ
తత్వానికి పెనుదెబ్బ. 1947 ఆగస్టు 15 న దేశమంతా
సంబరాలు జరుపుకొంటోంది.

“ఎవరైనా మనకిచ్చేది
తాత్కాలికమైనది…
కృషితో సంపాదించుకునేది
శాశ్వతం”

అహింస ఆయుధంగా,
సత్యం , ధర్మం, సైన్యంగా
చెడు చూడకు , వినకు , అనకు
అను నినాదాలే నీ నాదంగా,
జాతిపితగా కీర్తిగాంచిన ఓ మహాత్మా ,
అమరం నీ స్ఫూర్తి,
అజరామరం నీ ఖ్యాతి…

దేశ విభజనతో పాటు దేశంలో
పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరిగాయి.
ఈ ఘర్షణ వాతావరణాన్ని
చల్లబరచి ప్రజల మధ్య శాంతి
సామరస్యాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!