సంధ్యా సమయంలో

(అంశం:”సంధ్య వేళలో”)

సంధ్యా సమయంలో 

రచన: బుదారపు లావణ్య

సాగరతీరంలో
సంధ్యా సమయంలో
వెన్నెల వెలుగులలో
వెచ్చని కౌగిలిలో
ముచ్చటగా అల్లుకొని
ముద్దు మురిపాలలో
తేలియాడుతూ
ఎగిసిపడే అలలా
ఏదలో ప్రేమంతా
మదినిండా ఉప్పొంగంగా
ఇరువురం ఒకటై
లోకాన్ని మరిచి
మదిలోని భావాలను
మరి మరి పంచుకుంటూ
సముద్రతీరంలో
సయ్యాటలాడుతూ
ఆనంద సాగరంలో
ఆదమరచి సంచరిస్తూ
అందమైన అలల తీరంలో
హాయిగా కేరింతలు కొడుతూ
ఎగసిపడే కెరటాల నడుమ
ఎదసవ్వడి వింటూ
ప్రపంచాన్ని మరిచి
ప్రేమ తీరంలో
విహరిద్దాం…..
ఈ సంధ్యా సమయంలో.
****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!