చిరకాల స్వప్నం

చిరకాల స్వప్నం

రచన: బండి చందు

నిండా రెండు పదుల వయసైనా
నిండని ఓ యువకిశోరం
సియాచిన్ హిమపు శిఖరాగ్రాన
ఎముకలు కొరికే చలిలో
ఊపిరాడని ఎత్తులలో
తడారిపోవు గొంతుకతో
రుదిరాశ్రువుల దారలతో
చావుని స్వాగతించే కళ్ళతో
నిస్వార్ధపు స్వేచ్ఛా శ్వాసలకై
మొక్కవోని దీక్షతో
పింగళివారిని స్మరిస్తూ
ఎగురవేసిన త్రివర్ణ పతాకం
అదిగో అక్కడ ఆ జెండా అంచున
నా కల రెపరెపలాడుతున్నది
చిరకాల స్వప్నాన్ని చిరుకాలంలో
నెరవేర్చుకోమంటు ఆహ్వానిస్తోంది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!