చెయ్యెత్తి.. జై కొట్టు తెలుగోడా..!

చెయ్యెత్తి.. జై కొట్టు తెలుగోడా..!

రచన:: లోడె రాములు

తెలుగును ఉప్పుపాతర వేసి ఊరగాయలా నంజుకుంటున్న రోజులివి…
వ్యవస్థలో దేన్నైనా కోమాలోకి పంపి,
తిరిగి తామే బతికించామని చెప్పడమే రాజకీయ పరిపాలన..
అందులో భాగంగానే నేడు తెరమీదికి తెచ్చిన సంస్కృతం అకాడమీ వివాదం..
ప్రభుత్వాలు ఏమిచ్చినా ఇవ్వకపోయినా కష్టాలు, సమస్యలను మాత్రం గ్యారంటీ గా ఇస్తూనే ఉంటారు..
ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం బాష బతికే ఉంటుంది.
బూతులవల్ల బాష,.పోలింగ్ భూతుల వల్ల ప్రభుత్వాలు…
తెలుగురాని టీచర్లతో తెలుగు.. ఇంగ్లీష్,సంస్కృతం రాని వాళ్లతో సంస్కృతం, ఇంగ్లీష్ భోధన …
భావి తరాలకు ఏ భాష రాక దుర్భాష లాడుకునే స్థితికి వస్తుంది.
ఒకప్పుడు తెలుగుకు ప్రపంచ భాషల్లో దేనికీ లేని అదృష్టం..
నిత్యం అవధానులు,సాహిత్య గోష్టులు, రాజుల కనకాభిషేకాలు…
ఈ మధ్య మళ్ళీ అవగాహన పెరుగుతుంది..అనగానే..
ఇలా ఏదో ఒక సమస్య….
ప్రభుత్వం చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ,
ప్రజల ఆలోచనలను తప్పుదారి పట్టిస్తుంటాయి..
రాజకీయ క్రీడలకు చప్పట్లు కొట్టే అనామకులు కాదు..ప్రజలు
మార్కుల కోసం..పేరు మార్పు చేస్తే,
మీకు సున్నా మార్కులు మేమేస్తాం..జాగ్రత్త…
తెలుగు అకాడమీ కోసం ఓ సారి
చెయ్యెత్తి.. జై కొట్టు తెలుగోడా..!

*******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!