వెన్నెల చెరసాల
రచన:: డా|| బాలాజీ దీక్షితులు పి.వి
కన్నె జల్లులో తడిసి
వలపు వలలో
చిక్కుబడిపోయా
పొంగుల పరువపు
సుడిగాలి తగిలి
బిగుసుకుపోయా
వంపుల అలల
సుడిగుండాన పడి
అల్లలాడిపోయా
అలాగే
జబ్బల జడికి
ఎదల ముబ్బడికి
పెదవుల కలవడికి
చూపుల కసికి
నడుము సడికి
తబ్బిబైన
నేను
నీ మాయా ద్వీపంలో
కట్టుబడి పోయి
వెన్నెల చెరసాలలో
బంధీనయ్యా
***