కొంటే కొనంగి

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

కొంటే కొనంగి

రచన :: దోసపాటి వెంకటరామచంద్రరావు

కొంటే కొనంగండి నా పెళ్ళాం
కోతలెన్నో కూస్తుంది
కధలల్లిచెబుతుంది
ఉన్నచోట వుండదండి
పిలిస్తే పలకదండి
పనులన్ని పక్కన పెట్టి పక్కింట్లో మకామండి
కూరచెయ్యమంటే చారన్నం పెడతదండి
అన్నం పెట్టమంటే జావకాసి ఇస్తదండి
అడగకుండ అన్ని చేస్తదండి
అవితిన్నాక అసలు విషయం చెబుతదండి
అదేనండి పుట్టింటి పొతదండి
ఎప్పుడొ ఉరమని మేఘంలా వస్తదండి
పుట్టింటి కబుర్లతో పుకార్లు చెబుతదండి
పేళ్ళామంటే పెళ్ళమండి
ప్రేమతోనే చూస్తదండి
మనమడిగింది ఇవ్వదండి
తనకిష్టమైంది ఇస్తదండి
కొట్తనంటే కొట్తనంటదండి
తిట్తనంటే తిడ్తదండి
చిన్నవారికి చిన్నపిల్లండి
పెద్దలకి పెద్ధేనండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!