కుటుంబం

కుటుంబం

రచన: చెరుకు శైలజ

కుటుంబాలు ఎందుకు ఇలా ఉంటున్నాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమగా ఒకే తీరుగా పెంచుతారు వారు పెరిగి పెద్దయ్యాక అన్నదమ్ములు
ఒకరిపైన ఒకరికి ఈర్ష ద్వేషాలు
అక్క చెల్లెళ్లలకు పంతాలు, పట్టింపులు
ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం
అందరు ఓకే దగ్గర ఆడుతూ పాడుతూ పెరిగారు
ఎవరి ఆస్తులు అంతస్తులు వారికి వచ్చాక ఎందుకు మారారు
తల్లిదండ్రుల పెంపకమా
మీరు పెరిగిన వాతావరణమా
డబ్బుతో వచ్చిన అహం కారమా
మన కుటుంబం గురించి మనమే చెడుగా చెప్పుకోవడం ఎందుకు
ఏదైనా ఉంటే అందరు కలిసి కూర్చుని ప్రేమగా మాట్లాడుకోవాలి
మనసులో ఉన్న బాధ తీరిపోతుంది.
ఎందుకు మనసులో పెట్టుకొని మసలి పోవడం. మమకారాలతో మంచిగా ఉండక.
ఇప్పటికైన కనులు తెరవండి
అందరు ఏ కోపతాపాలు లేకుండా కలిసిమెలిసి ఒకే కుటుంబం లా మెదలండి
అప్పుడే మిమ్మల్ని కన్నవాళ్ళకు సంతోషం
మీకు సంతోషం
మిమ్మల్ని చూసి రేపు మీ పిల్లలు కూడా అలాగే కలిసిమెలిసి ఉంటారు.

***

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!