కలయో… మాయో..

అంశం:మన్మథ బాణం

కలయో… మాయో..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

విశాల ఫలభాగముపై…
జరాడే ముంగురులు…
ముసిరే మబ్బులను తలపిస్తూ…
అది మోమో…?చందమామో…?!
మెరిసే కాంతులు వెదజల్లే వాలుకన్నులు.
కనుల అంచులకు దిద్దిన కాటుకరేఖలు.
సింగారించిన కలువ కన్నులా…?
సంధించిన మన్మథ శరములా…?!
అందమైన అడుగులకు మడుగులొత్తుతూ.
లయబద్ధంగా ఊగే వాలుజడ.
అది జడా… ?
వెంటపడే పోకిరీలపై
ఎత్తిన కొరడా…?!
పెదవంచు చివరన అందంగా
పూసి ఆకర్షిస్తూ…
ఆహ్లాదపరుస్తూ…
అవి నవ్వులా… ?
విరిసిన పువ్వులా…?!
ఘల్లుఘల్లున కాలి
అందియలు మ్రోగ…
హొయలొలికే నడకలతో నడచివస్తూ…
ఆమె కలహంసయా…?
కావ్యనాయికయా…?!
కళ్లెదురుగా ఇంతటి సౌందర్యంతో
శోభలీను అచ్చెర కన్నియ…
ఇది కలయో…?!
మరి మాయో…?!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!