అందమైన హరివిల్లు
రచన: కమల ముక్కు
సప్తవర్ణ శోభితమైన ఇంధ్ర ధనుస్సును
చూచినంతనే చాలు తనువంతా పులకింత
మనసంతా ఏదో తెలియని పరవశం/
కళ్లకింపైన హరివిల్లులానే
ఉండాలి మన జీవితం
సంతోషం దుఃఖం శాంతి కోపం
బాధ ప్రేమ ద్వేషం అన్నీ కలగలిసిన
సప్త రాగద్వేషాల మిళితమే
మానవ జీవితము/
సప్త వర్ణపు శోభతో విరాజిల్లే
ఇంద్రధనుస్సు కాదా సూచిక
వర్షపు రాకకు
అదే సప్త వర్ణ శోభ నిండిన రాగద్వేషాలే
సూచికలు కావా
మనలోని పలు మానసిక స్థితులకు
ఎన్ని వర్ణాలు ఉన్నా
అన్నింటినీ మిన్న తెలుపు వర్ణము
ఎర్రని రంగులో తెల్లని వర్ణము కలిపితే
అందమైన ఆరేంజ్ రంగు వచ్చినట్టే
కోపంగా ఉన్న వారితో శాంతంగా
మాట్లాడితే చాలు వారు ప్రశాంతంగా మారేను/
అంటే కోపం బాధా ద్వేషం ఎన్నున్నా
చల్లని ప్రేమ ని పంచే వారుంటే
ఆ జీవితమే ఓ అందమైన హరివిల్లు/