ఉల్లి తెచ్చిన లొల్లి
రచన : కందర్ప మూర్తి
” ఉల్లి తెచ్చిన లొల్లి”
ఉల్లి , ఉల్లి నీకేమైనాదే తల్లీ!
ఎందుకు పెట్టావే ఇలా లొల్లి
పంచబాష్యాలొద్దు
పసిడి భాగ్యాలొద్దు
ఏ కూర వండినా నువ్వుండాలే
ఘుమ ఘుమ సాంబారులో
నువ్వు లేకుంటే లేదు రుచి
ఉల్లి లేందే పెసరట్టు లేదంటారే
ఉల్లి లేని ఆమ్లెట్ వద్దంటారే పిల్లలు
ఉప్మాలో పకోడీలో నువ్వుండాలే తల్లీ!
కోడి కూరలో కాకరకాయ వేపుడిలో
మటన్ ఫ్రై మంచూరియా ఇలా
షడ్రుచులలో నీవుండాలె పోరీ!
ఏమైనాదే నీకు,; ఆకాశాని; కెక్కినావు
నీ లొల్లి తో కన్నీరు కార్పించకే వల్లీ
దిగి రావే ఉల్లి తల్లి , నీ కాల్మొక్కుతా!