ప్రేమ విలువ కాల్చకు!

అంశం: మన్మథ బాణం

ప్రేమ విలువ కాల్చకు!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

పరమశివుడే బూడిద చేసినా
సృష్టి కార్యము సలుపదలచి
మాత పార్వతి జీవమునిచ్చె
పూల శరమున ప్రేమ నిలిపి
మన్మధుడు అవతరించె
మగువ మనసు నెరిగి
ప్రేమ మకరందము గ్రోవవలె
తిరస్కరించెనని తలచి
తనువు చాలించినా
దాడులే చేసి అతివను
అంతమే చేసినా
పవిత్ర ప్రేమకు విలువేది?
మన్మథ బాణపు సార్థకత ఏది?
ఆది దంపతుల తలపుకు అర్ధమేది?
జగతిని నాశన మొనరింప
నీకు అధికార మెక్కడిది?

You May Also Like

7 thoughts on “ప్రేమ విలువ కాల్చకు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!