చూపుల బాణం 

అంశము: మన్మథబాణం

చూపుల బాణం 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

సంధ్యారాగంలో  పడమటి పొడుపులో
నా మనసుకి  వేసావు మన్మధబాణం
కోటి ఆశలతో చూసాను నీవంకే
చిటుక్కున మాయమైపోతావు
మళ్లీ వస్తావు ఉదయాన్నే చల్లని చూపులతో
అందని జిలుక్కులతో వేసావు మన్మథబాణం
అందుకోవాలనెే ఆశ అంతుచిక్కని దూరం
కిలకిల రాగాలతో వస్తాయి నా వంకే చూస్తూ
అక్కున చేర్చుకోవాలని చూస్తాను
అందుకునే లోపే తుర్రుమంటాయి
బాధగా చూస్తాను వాటివంకే
అవి నా కోసం కాదని తెలిసింది.
నేను వేసే బియ్యపు గింజల కోసమని
మళ్ళీ వచ్చాయి నా వైపే వాటిలో
కనిపించాయి కృతజ్ఞతాభావం
నా మనసుకు తగిలింది చిరునవ్వుల బాణాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!