(అంశం:”అగమ్యగోచరం”)
యువత భవిత
రచన ::దొడ్డపనేని శ్రీ విద్య
ఈనాటి యువతరం ఊగుతోంది మత్తులో
అందమైన బంగారు భవిష్యత్తును వదిలి
దూరపు కొండలు నునుపు లాగా….
కైపులోనే మరో ప్రపంచం ఉందని ఆశతో
వారి కోరికలను ప్రక్క ద్రోవ పట్టిస్తూ….
తల్లి తండ్రుల ఆశలను అడి యాసులు చేస్తూ….
జీవితాన్ని అగమ్యగోచరంగా చేసుకుంటూ…
ఏ మాత్రం నష్టపోతున్నామో ఊహించక
పెద్దల మాటలని పెడచెవిన పెడుతూ….
నైతిక విలువలను దిగజార్చేలా పయనిస్తు…
నీ ఇంటి వారికి దిగమింగ లేని దు:ఖాన్నిస్తూ….
ఎటు వెళుతుంది నీ ఉజ్వల భవితవ్యం….
కానీకు ఆయోమయం, భాధాకరం
మేలుకో యువత…..
జాగృతి కలిగి ఉండు
***
ధన్యవాదములు. ఎంతో ప్రోత్సాహం అందుకుంటున్నాము
చాలా సంతోషం ఇలా మా కవితలు మనోహరం website లో చూసుకో గలుగు తున్నందుకు