ప్రాణదీపం

అంశం: చీకటి వెలుగులు

ప్రాణదీపం

మక్కువ. అరుణకుమారి

చీకటి వెలుగుల జీవితం
కష్ట ,సుఖాల సమ్మిళితం
ఆశ ,నిరాశల సంభూతం

అరుణోదయ కిరణ కాంతిచే
వేడెక్కినపుడే
చంద్రోదయ శీతలానికై ఎదురుచూసేది

తిమిరంతో సమరం చేసి జయిస్తుంది వెలుగు
హృదయ తిమిరాన్ని జయించినపుడే ఆనందపు జ్యోతులు వెలుగు

చీకటి అంటేనే నాకిష్టం.
కష్టానికి సంకేతమని కాదు
కష్టాన్ని మరపించి,ఇష్టాలను తీర్చే
కలల ప్రపంచంలో విహరింపజేస్తంందని.కాసేపైన సేదతీరుస్తుందని

వెలుగు అన్నా నాకిష్టం.
సుఖాలను ఇస్తుందని కాదు
నా నుండి తప్పిపోయిన నా ఇష్టాన్ని
ఎటునుండైనా వెదికి ఇస్తంందని
దరిచేరే ఆ ఇష్టాన్ని స్వాగతించాలని

గోరంత దీపంతో కొండంత వెలుగులు పంచాలని
చిగురంత ఆశతో జగమంతా వెలుగులు నిండాలని
ఎదురుచూద్దాం, కొన ఊపిరి ఆగేవరకు
ప్రాణదీపం మలిగే వరకు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!