తిమిరహరం

అంశం: చీకటి వెలుగులు

తిమిరహరం

రచన: డా॥అడిగొప్పుల సదయ్య

ఇరుల తెరలను మాపి ఈశ్వరుని చూపెట్టి
జనుల యందున భక్తి జనియింపజేసేది

దివ్యదేశములన్ని దీపకళికల మెరియ
పావనాపగలన్ని పరిమళించెను కాంతి

నాయనార్లే శివుని నానందమున కొలువ
ఆళ్వారులందరూ అచ్యుతుని పాడిరీ

శివకేశవత్వమే చిందులేసెను భువిని
కాంతులన్నియు పరిచె కరుణాంతరంగమును

బాహ్య చీకట్లనూ పారద్రోలెను దివ్వె
అంతరాంధమ్ములును అంతరించెను భక్తి

కాంతిశ్రీ పరిమళము కవుల డెందము జొచ్చి
వెలయించె కవితలను వేలాది రీతులను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!