జీవన పయనం

అంశం: చీకటి వెలుగులు

జీవన పయనం

రచన: జె వి కుమార్ చేపూరి

చీకటి వెలుగులు దైవ నిర్మితాలు
జగతిని నడిపే సమతుల్యతలు
తీపియైనా తినగతినగ వెగటు పుట్టు
తినగతినగ వేప తీయ్యగ నుండు

తీపిచేదుల కలయికతోనే బతుకు వర్ధిల్లు
ప్రతినాయకుని వల్లే నాయకుని విలువ చెల్లు
పగలంతా శ్రమించిన జీవి శరీరం
చీకటిలో శయనించి పొందు విరామం

ఒకటి వెంట ఒకటి వున్నా చీకటి వెలుగులు
కనలేవు అవి తమ ముఖారవిందాలు
కష్టసుఖాల కలయికలోనే జీవన మాధుర్యం
వచ్చిన వేదనలు నిలువవు కలకాలం

కష్టము వెంటే సుఖమున్నది నిజం
తెలుసుకుంటే బతుకు సుందర స్వప్నం
అంతా మంచికని అనుకోవడమే ఉత్తమం
చీకటి వెలుగుల తోనే ముడిపడి ఉన్నది
మానవాళి జీవన పయనం అన్నది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!