నేటి బాల్యం

నేటి బాల్యం 

రచన::స్రవంతి

జ్ఞాపకాల దొంతర లో అల్లుకున్న మనసు..

నేరేడు పండ్లకై పరుగు తీసిన రోజులు..

తొలకరి జల్లులకు తడిసి ముద్దయిన
భూమాత వెదజల్లే మట్టి సువాసనలు…

పెరటి నిండా రకరకాల పూల మొక్కలతో నింపాలనే ఆరాటాలు…

వర్షపు తేనీటిని బంధించి పిల్లకాలువలా మలచి పడవల తో చేసే చిలిపి అల్లర్లు…

సాయం సంధ్యా వేళలో జత గాల్లతో
ఆడే దోబూచులాటలు..

బడి లో మాష్టర్ వేసే కోదండం, దేశ పండగలప్పుడు పాడే పాటలు , ఆడే ఆటలు…

సెలవులలో అమ్మమ్మ ఇంటికి చేరి తోటలో దోచుకునే జామ పండ్లు,మామిడి పండ్లు ఎంత తిపో…
మనసులో జ్ఞాపకాలు కదలాడుతున్నాయే

నేటి బాల్యం నాలుగు గోడలకె పరిమితమయ్యేను నేడు.

నేటి బాల్యం కాలుష్యంను ఆస్వాదిస్తోంది

నేటి బాల్యం ఆట పాట లకు దూరమై
ఊబకాయంగా మారుతుంది నేడు

నేటి బాల్యం నోరు తెరుచుకుని ఉన్న
నాలాలకు ఆనావాల్లు అయ్యెను నేడు

నేటి బాల్యం మహమ్మారి వలన ప్రేమ ఆప్యాయతలకు దూరమైతున్నది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!