పరిణయ వసంతం

పరిణయ వసంతం

రచన::వి. కృష్ణవేణి

మూడు ముళ్ల బంధంతో ఒకటై అగ్నిసాక్షిగా జతకట్టి…
ఏడడుగులతో జీవితాన్నేముందుకు నడిపిస్తూ,..
నా ప్రాణానికి ఊపిరి నీవై
నా ఊపిరికి ఆయువు నీవై
ఆయువుకు తోడు నీడవై!
నీవేనాచెలివి,నీవే నా నేస్తనివి అంటూ…
నీ ప్రేమలో ముగ్దురాలిని చేసి
నీ ఒడే శ్వాసగా లాలీస్తూ..
నా ఊహలగాణమై!
నా కలలస్వప్నానికి వారధివై!
ఆశలకు అవధులు పలుకుతూ
ఒకొక్క వసంతాన్నినవ వసంతంగా ఆహ్వానిస్తూ
దశ వసంతాలనుదాటివస్తూ ..
ఎన్నో  అంతర్మదనాలను ఎదురీది
నీలో మదనాన్నిచవిచూసి..
ఎన్ని యూగాలు దాటివేశానో!
దాటినా యుగామంతా ఒక్క క్షణంలా
గడిచిపోయింది నీ ప్రేమతో…..!
ఎన్ని జన్మలయినా విడిపోనిబంధమై.
జన్మజన్మలకు నీవే తోడువై..!
పరిణయ జీవిత పరమార్దానికి
సాక్షానివి నీవేగా!…
నా ప్రియానేస్తమా!
వివాహబంధాన్ని తిరిగి మళ్ళీ ఆహ్వానిద్దాం,
ఆశ్వాదిద్దాం పెళ్లి రోజుతో…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!