మనస్సు జంజాటం

మనస్సు జంజాటం 

రచన::జయకుమారి

దేని కోసం ఈ జంజాటం..
ప్రేమ కోసం మా..
ఎక్కడ ప్రేమ.?
ఎవరి ప్రేమ?
కలవలేము అని తెలుసు.
మరువలేము అని తెలుసు.
విడువలేము అని తెలుసు.
తెలిసి కూడా మరి ఈ ఆరాటం దేనికి
ఈ మాయాజాలం లో చిక్కి
విలవిలలాడటం దేనికి.
కానీ  మనస్సు  బంధనాల వల లో చిక్కుకుపోయి తనని తానే మరిచి ఏదో పిచ్చిలోకంలో ఉండేది ఎందుకో
సృష్టికర్త అయిన బ్రహ్మయ్య చెప్పయ్యా
లయకారుడవు అయిన శివయ్య నువ్వైనా చెప్పయ్యా.!
ఆది,అంతం మీ మాయ.
గమనం,గమ్యం మీ చిత్తం.
అంతా మీరై, అన్నీ మీరైనప్పుడు
ఈ ఆటలేలా, మీ లీలలేలా.
మాకు ఈ బంధనాల సంకెళ్లేలా.
చెప్పండయ్య త్రిమూర్తులారా!
మసకబారిన  మనస్సు బాధను తీర్చేదెప్పుడో.

You May Also Like

One thought on “మనస్సు జంజాటం

  1. అద్బుత భావజాలం మనస్సు మర్మం గురించి 👏👏👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!