స్వశక్తి

స్వశక్తి

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

“అన్నయ్య నువ్వే‌,  నాకు దారి చూపాలి” అని తన చెల్లెలు ఎప్పటికైనా తన దగ్గరికి వచ్చి అంటుంది అనుకున్నాడు రమేష్. కాని అతని అంచనాలు తారుమారుచేస్తూ… తన చెల్లెలు ఇంత ఎత్తుకు ఎదుగుతుందని ఏనాడు అనుకోలేదు.
సుధ అంత ఎత్తుకు ఎదగడానికి కారణం, అన్న ఇంటికి వెళ్ళకూడదన్న తన పట్టుదలే…  రమేష్ కి తెలియని అస్సలు  విషయం ఏంటాంటే…

    సుధ, రమేష్ వాళ్ళు పదేళ్ళ క్రితం ఒక దగ్గర ఉండేవాళ్లు. అప్పుడు ‘సుధ పన్నేండేళ్ల  కూతురికి  ఎప్పుడు,  ఏ పాఠాల్లో అనుమానం ఉన్న”మావయ్య”  అంటూ  వచ్చి రమేష్ ని పాఠాలు చెప్పమని అడుగుతూ ఉండేది…

    అది చూసిన రమేష్ అత్తగారు, తన కూతురుతో… “ఆ పిల్ల అలా అస్తమానం రమేష్ మీద పడుతుంటే…,  ఏదోనాడు నీ మొగుడు ఆ పిల్ల వలలో  పడటం ఖాయం. అప్పుడు నీకు చిప్పే గతి” తన తల్లి చెప్పిన మాటలు విన్న రమేష్ భార్య…

    ఆ అమ్మాయి ఎప్పుడు రమేష్ దగ్గరకు వచ్చిన … “స్నానం చేయండి”.  “కూరలు తెండి” “భోజనం చేయండి” అంటూ, ఏదో వంకతో అతనిని అక్కడి నుంచి తప్పించేస్తూండేది.

    రోజు కూతురు పడుతున్న బాధ వినలేకా ,చివరగా తల్లి చెప్పిన మాటలతో…  రమేష్ ని  పోరు పెట్టి, సుధ వాళ్లింటి నుంచి దూరంగా… తన అమ్మగారింటికి దగ్గరగా తీసుకెళ్ళిపోయింది… కాని ఆ తల్లి కూతుర్ల మాటలు చెవిలో పడ్డ  సుధ,  ఎంత అవసరం వచ్చిన ఆ ఇంటికి మరేప్పుడు  వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందని అస్సలు ఊహించనైనా ఉండదు
ఈ మధ్య సుధ వాళ్ళాయన వ్యాపారంలో దివాళా తీయడంతో ఆ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుందని  తెలుసు రమేష్ కి. కాని,’అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు. చూద్దాం నా దగ్గరికి వేస్తే, అప్పుడు ఏదో రకంగా సాయం చేద్దాం’ అని చూస్తూన్నాడు.
కాని అతనికి తెలియని విషయం ఏంటాంటే… ఏదైనా ఫంక్షన్ల అప్పుడు తప్పనిసరై… సుధ వాళ్లింటికి వచ్చిన ఒక పూట గడవక ముందే…
“తన ఇంటికీ వచ్చిన  సుధకి చీర, పసుపు, కుంకుమలు పెట్టమంటుందేమో అని, తన కూతురిని మేనమామ మీదకు ఊసిగోల్పి వాళ్ళ సంసారంలో  ఎక్కడ నిప్పులు పోస్తుందోనని” ముందుగానే తానంతట తాను ఊహించుకుని, భయపడిన రమేష్ భార్య, ఆమె తల్లి తో కలిసి   ఏదో ఒక మాట అంటూ… బాధపెట్టి,  సుధ ఏది అడగక ముందే రమేష్ పని ముగించుకుని వచ్చేలోగా తనంతట తానుగా వెళ్లిపోయేలా చేసేవారు..

    రమేష్ వచ్చి సుధ గురించి అడిగితే, ఏదో పనుందని వెళ్ళిపోయిందనో… లేకా వాళ్ళాయన వచ్చి తీసుకెళ్ళిపోయారనో కూతురు చేత కుంటిసాకులు చెప్పించి… కవర్ చేసేసేది, అతని అత్తగారు.

   సుధ ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్నప్పుడే ఇన్ని ఆలోచనలు చేసిన ఆ తల్లికూతుర్లు… ఆర్థికంగా చితికిపోయిన సుధ,  వాళ్లింటికి వెళ్తే… తన పరిస్థితి ఎలా ఉంటుందో సుధ గ్రహించలేదు అనుకోవడం పోరపాటు.

    అందుకే సుధ ఎంత కష్టమైన ఒకరి ముందు చెయ్యి చాచాకుండా  రాత్రి పగళ్లు తనకు వచ్చిన చిన్న చిన్న ఆర్టికల్స్ తయారుచేసే విద్యనే భర్త సహాయంతో మెరుగుపర్చుకుని,  దోరికిన ప్రతి ఆవకాశాన్ని  అందిపుచ్చుకుని… తన పిల్లలను ఉన్నత చదువులు చదివించి… ఉద్యోగులను చేసింది…

    ఇప్పుడు సుధ ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. తానే నలుగురికి ఉపాధి కల్పించే స్థితిలో ఉంది…

  ‘ఏదైనా చిన్న కష్టం రాగానే వెంటనే పుట్టింటి అండదండలు ఉన్నాయని పుట్టింటికి పరుగులు పెడితే… ఎప్పటికైనా అవమానాలు తప్పవు.

     కనుక ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ముందుగా తన వంతుగా తనకు ఏం చేతనవును అని ఆలోచిస్తే… ప్రతి మహిళ ఎవరి మీద ఆధారపడకుండా  తన కాళ్ల మీద తాను బతకడమే కాకా… మరో నలుగురికి ఉపాధి కల్పించగలదని’ తన అనుభవం ద్వారా  ఋజువు చేసింది సుధ.

ఆ విధంగా తాను కన్న ఆశలసౌధం ఎవరి సాయం లేకుండానే నిర్మించుకుంది సుధ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!