వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

కనుతెరిస్తే జననం
కనుమూస్తే మరణం
లిప్తపాటు జీవితకాలం అన్నది అక్షర సత్యం.
జీవించడానికి ప్రధానమైనది శ్వాస
నీవు వదిలే చెడుగాలిని స్వీకరించి అందుకు బదులుగా పుడమి పై
నే జీవనపర్యంతం దోహదపడే మంచి గాలిని
నీ కిచ్చే పచ్చని చెట్లు పరమాత్ముని ప్రతిరూపాలే…..!!

పర్యావరణ సమతుల్యతని పరిరక్షించే పచ్చని చెట్లను నీ స్వార్ధం తో అవసరాలకై నాశనం చేస్తుంటే వస్తున్నవే
ఇప్పటి  వరదలు, ఉప్పెనలు,సునామీలు మరియు భూతాపాలు
“వృక్షో రక్షతి రక్షితః”
అన్న సూత్రాన్ని  జీవితాంతం పాటించిన
“చిప్ కో” ఉద్యమకారుడు
నిన్న కరోనా కు తొంబది సంవత్సరాల వయస్సులో మరణించిన సుందర్ లాల్ బహుగుణ మరియు మేథాపాట్కర్ ల అడుగు జాడలని అనుసరించి
పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అని నిరూపిద్దాం……..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!