రంగురాళ్లు
రచన: పద్మజ రామకృష్ణ.పి
జాతిరత్నాలు అని బ్రమపడి ఏరిపారేసిన రంగురాళ్లను అపురూపంగా ఎంచుకుని
వెలకట్టలేని విలువ కలిగిన పసిడిని దానికి జోడించి హారంగా బంగారంతో పొందుపరచి కంఠమున మురిపెంగా ధరించి మురిసిమెరిసిన నాడు
దాని జాతి తెలుపుతూ రాళ్లు రంపాలై శరీరాన్ని తూట్లు పొడుస్తుంటే గాయాలను దాచేస్తూ మెరిసే హారంతో
కప్పేస్తూ రాళ్ళ విలువ తెలిసినా తెలియని!
గంబిరాన్ని ప్రదర్శిస్తూ అందరి కనులకు అపురూపంగా హోదా కలిగిన శ్రీమంతురాలిని నేనే కదా!అందరిలో సిరిసంపదలు మాత్రమే వెతికే కళ్ళు అవి స్వార్ధపు సంకెళ్లు అందుకే వాటికి కానరావు ఏ శరీరగాయాలు