రంగుల ప్రపంచం

రంగుల ప్రపంచం

రచన: సావిత్రి కోవూరు 

యాంత్రిక జీవనమున అలసిన మనసుల ఆహ్లాదం కలిగించే పరమ ఔషధమే సినిమా

మూడు గంటల లోపు మురిపెంగా మనిషి అన్ని దశలను చూపి,ఇహలోక బాధలన్నిటినీ మరిపించు

మహా అద్భుతమీ సినిమా నవ్వించు, ఏడ్పించి, భయపెట్టి, ఓదార్చు నవరసాలొలికించి, రంజింప చేయు ,

ఊహల లోకాల ఓలలాడించి, కనని లోకాల కనుల ముందర దించి, రసరమ్య లోకాల తేలి ఆడించు,

మంచి గ్రహించిన ప్రతిఫలం చూపు, చెడు అలవర్చుకొనిన అనుభవించు శిక్షలేంటో తెలుపు

మంచి చెడుల సమాహారమే సినిమా

రాయంచలా మంచి గ్రహిస్తే మనసు  కేరింత ఆడించి మంచి ఫలములిచ్చు,

చెడును గ్రహిస్తే అలవరచు కొనిన శిక్షలేంటో తెలుపు

నీవేది గ్రహిస్తావో  నీ విజ్ఞతకే వదులు సినిమా.

తీసేవాళ్ళు కోట్లుకోట్లు వెచ్చించి ప్రేక్షకులకు విషగుళికలు అందించకండి

మిమ్ము బ్రతికించేదే వారని మరవకండి
బాధ్యతెరిగి నిర్మిస్తే మీకు మాకు మనందరికీ మంచిది కదా. ఆలోచించండి ఒక్క క్షణం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!