దెయ్యాలదిబ్బ

(అంశం:”అల్లరి దెయ్యం”)

దెయ్యాలదిబ్బ

రచన: పద్మజ రామకృష్ణ.పి

ఆ ఊరి పేరు వేటపాలెం. ఊరు మధ్యలో పెద్ద చెత్తదిబ్బ.చాలా ఎత్తుగా ఉండేది… మసక పడింది అంటే రిక్షా వాళ్లకు కూడా చాలా భయం.ఆ దిబ్బ అంటే…ఆ దిబ్బ మీద దయ్యాలు ఉంటాయని.చీకటి పడితే చాలు వచ్చే పోయే రిక్షా.ఆటో.బైకులను కదలనివ్వక.అవి చేసే అల్లరి అంత ఇంత కాదు అని ఊరుఊరంతా చెప్పుకునే వాళ్ళు..అక్కడ అల్లరి దెయ్యాలు ఉన్నాయ్ అంటూ అందరి నోట ఒక్కటే మాట…

వేటపాలెం ప్రక్కనే చీరాల ఉండేది. పని రీత్యా అమ్మమ్మ వేటపాలెం నుండి ప్రొద్దుపోయాక చీరాల పోవలసి వచ్చింది.అప్పటికే ఆరు దాటుతుంది…ఒక రిక్షా అతన్ని పిలిచింది అమ్మమ్మ. చీరాల వస్తావా అని అడిగింది..బాబోయ్ నేను రాను అసలే ఆ దయ్యాలదిబ్బ మీదగా పోవాలి.అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రిక్షా అతను…ఇప్పుడు మరో రిక్షా వచ్చింది..రిక్షా చీరాల వస్తావా అని మరల అడిగింది అమ్మమ్మ..మాములుగా అయితే ఎవరు రారు.అతనిది కూడా చీరాల కావడంతో ఇల్లు చేరాలి కదా ఖాళీగా పోవడం ఎందుకు అని అమ్మమ్మని కూడా రిక్షా ఎక్కించుకుని బయలుదేరాడు..చల్లటి గాలి. చీకటి పడిన దారి వెంట ఆ రిక్షా కదిలింది…అమ్మమ్మకు ఆ దెయ్యాలదిబ్బ దగ్గరలోకి వస్తుంది ఇప్పుడు ఎలా దాటడం అని మనసులో భయం పట్టుకుంది…ఆ భయం. ఆ దిబ్బ దాటే వరకు మర్చిపోవాలి అనుకోని.రిక్షా అతనితో మాటలు కలిపింది….మీది కూడా చీరాలేనా అంది..ఆ అన్నాడు.రిక్షా అతను…అమ్మమ్మ కళ్ళ ముందు కాస్తంత దూరంలో ఆ దెయ్యాలదిబ్బ దర్శనం అవుతొంది…భయాన్ని వ్యక్తిపరచలేక గుటకలు వేస్తూ.పిల్లలు ఎంత మంది నీకూ అని రిక్షా అతన్ని మరల పలకరించింది….ఈ సారి రిక్షా అతని కంఠం కూడా కొద్దిగా వణుకుతూ.ఇ ఇ ఇద్దరు అన్నాడు….రిక్షా దిబ్బను సమీపించింది..ఎవరో గట్టిగా పట్టి ఆపినట్లుగా కదలడం లేదు.రిక్షా….
*ఇక్కడ కట్ చేస్తే*

ఆ తరువాత ఏం జరిగిందో అమ్మమ్మకు తెలియదు..
అమ్మమ్మ ఇప్పుడు ఇసుక దిబ్బల మధ్య ఒక సన్నటి దారి లో.ఒక చేతిలో కుల వృత్తికి సంబంధించిన పాగాళ్ళు.మరో చేతిలో లడ్డిలు పట్టుకుని నడుచుకుంటూ పోతుంది…
వెనుక నుండి ఎవరో పిలుస్తున్నట్లు కేకలు వినిపించాయి అమ్మమ్మకు..
ఓ యంకాయమ్మ..ఓ యంకాయమ్మ అని…

అవును..ఆవిడ అమ్మమ్మ స్నేహితురాలు.కమలమ్మ..

ఏంటి ఈ టైములో.ఇటు వైపు వచ్చావు అని కమలమ్మ అడిగింది అమ్మమ్మను..
చీరాల పోవాలి అని రిక్షా ఎక్కా
అంది అమ్మమ్మ….
అవునా.ఇది కాలని కదా.ఇంకాస్త దూరం పోతే వస్తుంది చీరాల ఇక్కడ ఎందుకు దిగావు రిక్షా అని కమలమ్మ అడిగింది….

అమ్మమ్మకు అంతా
అయోమయంగా అనిపించింది..నిజమే నేను ఇక్కడ ఎందుకు దిగాను అని ఎంత ఆలోచించిన అర్థం కాలేదు..పైపెచ్చుఅమ్మమ్మ తలకు కూడా గట్టిదెబ్బ తగిలి రక్తపు చెమ్మ గూడు కట్టి ఉంది..

కమలమ్మ భర్తను అమ్మమ్మకు తోడు ఇచ్చి పంపింది చీరాల..

అమ్మమ్మ తలకి ఏమైంది అని అందరు అడిగారు….అందుకు సమాధానం చీకట్లో చెట్టు పొడుచుకుంది అని చెప్పింది అమ్మమ్మ….

అమ్మమ్మ పోయే వరకు కూడా చెప్పలేదు.రిక్షా ఆగిన తరువాత ఏం జరిగింది అనేది.! ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ గా మిగిలి పోయింది…..
*సమాప్తం*

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!