అత్యాశ

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

అత్యాశ

రచయిత :: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

జీవితంలో పైకి ఎదగాలనే ఆశ అభివృద్ధికి దారితీస్తుంది
అంతేగాని అత్యాశకు పోయి నింగికి నిచ్చెన లేయకు

ఉన్నంతలో జీవితాన్ని గడపక
నేల వదిలి సాము చేస్తూ

అందని పళ్ళకి అర్రులు చాస్తూ
పులిని చూసి నక్క వాతలు వేసుకున్న మాదిరి

బతుకు తక్కువ బడాయి ఎక్కువ చేస్తూ
మింగ మెతుకు లేకపోయినా మీసానికి సంపెంగ నూనె రాన్తూ

ఆస్తి మూరెడున్నా ఆశ బారెడు కలిగి
జరగలేనిదానిని జరుగుతుందని భ్రమిస్తూ

ఊహలలో విహరిస్తూ
పగటి కలలు కంటూ సమయం వృధా చేస్తూ

ఉట్టికే ఎగరలేని నీవు స్వర్గానికి ఎగరా
లంటూ
“”ఆకాశానికి నిచ్చెన”” లేస్తే

పైకి ఎక్కగలుతావా
లేదా కాలుజారి పాతాళానికి పడిపోయి పళ్ళు రాలగొట్టుకుంటావా

ఆలోచిస్తే నీకే అర్ధమవుతుంది
నీ స్థాయిని బట్టి నడచుకోవాలని

స్థాయికి మించి ఎగరాలనుకోవడం
ఆకాశానికి నిచ్చెనలేయడమేనని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!