నింగి అంత ఆశ

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

నింగి అంత ఆశ

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

ఆకాశమే హద్దుగా సాగేను ఆశలు
చుక్కల్లో వెన్నెల వెలుగులు మదిలో
హొరుగాలి వెచ్చటి స్పర్శ మీటగా
కళ్ళల్లో వేయి కాంతులు వెల్లువులే

జీవితంలో ఎన్నో ఆనంద హొయలు
చిటపట చినుకుల టపటపలు
చిన్ని ఆశలతో సరిపెట్టుకోని మనసు
ఆకాశానికి నిచ్చెన వేస్తుంది

స్వార్థం లేని ప్రేమను పొందాలని
డబ్బు పై ఆశను వదిలేయాలని
మానవత్వం ముసుగు వదిలేయాలని
మదిలో ఆకాశానికి నిచ్చెన వేసే ఆశ

లోకం తీరు పూర్తిగా మారాలని
ఎన్నో అవకాశాలల్లో విజయాలు
ఎన్నో విషయాలపై అవగాహనలు
ప్రతి మనిషి జీవితాల తీరని కోరికలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!