ఎగిరిపో
రచయిత :: బోర భారతీ దేవి
నిశీధి చీల్చుకు వచ్చిన వెలుగు రేఖవై….
కట్టుబాటు సంకెళ్లు తెంచి…
నవోదయం కోసం ఎదురు చూస్తూన్నా మగువా……..
ఎగిరిపో.
సతీ సహగమన
వితంతు వివాహ ,
కట్టుబాటు సంకెళ్లు తెంచి….
గడిపే దాటక కుటుంబ
బంధాల నడుమ నలిగిపోయే మగువా….. ఎగిరిపో.
నవయుగపు అంచుల్లోకి…
మగువ అబల కాదు సబలని నిరూపించే తరుణ మిదే సుమా……. ఎగిరిపో
నీ నువ్వే సాటి
నీ శక్తి యుక్తి ఆయుధాలుగా సాగిపో…..
నీ చూట్టూ పొంచి ఉన్న ప్రమాదపు అంచులు దాటి సాగిపో ……….
స్వేచ్ఛా విహంగమై.