కిల్లర్

కిల్లర్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : మాధవి కాళ్ల

                   సంధ్య అనే అమ్మాయి ఈరోజు తెల్లవారుజామున మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది అని న్యూస్ లో చెప్తున్నారు. చేతిలో ఫైల్ చూస్తూ ఇది ఆత్మహత్య కాదు హత్య అని గోవింద్ కి చెప్తాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ సీ.బి.ఐ ఆఫీసర్ తనకు వచ్చిన ఇలాంటి కేసులు అన్ని తన తెలివి తేటలతో  సాల్వ్ చేశాడు. సంధ్య తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏక్సిడెంట్లో చనిపోయారు. గోవింద్ కార్ తీయి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్లదాము అని చెప్పాడు సిద్దార్థ్. సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడైనా క్లూ దొరుకుతుంది ఏమో అని ఇల్లు మొత్తం తిరిగి చూస్తాడు సిద్ధార్థ్. సంధ్య రూమ్ లో కొన్ని టాబ్లెట్స్ కనిపిస్తాయి దాని వివరాలు ఏంటో తెలుసుకుందామని గోవింద్ పిలిచి ఆ టాబ్లెట్స్ ఇస్తాడు ఈ టాబ్లెట్స్ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి అని చెప్తాడు సిద్ధార్థ్. గోవింద టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళాడు ఇంకా ఇంకేం దొరుకుతాయేమో అని చూస్తున్నాడు సిద్ధార్థ్ ఇంకా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తున్నాడు సిద్ధార్థ్. సంధ్యా ఒక్క అమ్మాయే కాదు  దాదాపు 10 మంది వరకు చనిపోయారు. ఎందుకు చనిపోతున్నారు ఏ కారణంతో చనిపోతున్నారు అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారాని చెప్పుతున్నారు. సర్ ఈ టాబ్లెట్స్ లో ఎక్కువ మోతాదు డ్రగ్స్ కలిసింది. అని రిపోర్ట్స్ లో వచ్చింది సార్ అని చెప్పాడు గోవింద్. చనిపోయిన అమ్మాయిలు ఏ హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని తెలుసుకోవాలి అని గోవింద్ కి చెప్పాడు సిద్ధార్ద్. మళ్ళీ సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్లి సంధ్య కి సంబంధించిన రిపోర్ట్స్ దొరుకుతాయేమో అని చూశారు కానీ ఎక్కడ కనిపించలేదు. మిగతా అమ్మాయిల ఇంటికి వెళ్తే అక్కడ కూడా రిపోర్ట్స్ ఏవి ఎక్కడ ఉన్నాయి అని అడిగితే ఇంట్లో వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారు. కనీసం తను ఏ హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకుంటుందో తెలుసా అని అడిగాడు సిద్ధార్థ్. మాకు తెలియదు తను ఒంటరిగా వెళ్ళేది హాస్పిటల్ కి అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. అన్ని కేసులా లేదు చాలా టఫ్ గా ఉంది ఎలాగైనా ఈ కేసు ని సాల్వ్ చేయాలి అని మొండి పట్టు తో ఆలోచిస్తున్నాడు సిద్ధార్థ్. సార్ సంధ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రిపోర్ట్స్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్ళాడం సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది సార్ అని చెప్పాడు గోవింద్. అవునా అతనెవరు ఎవరో కనిపెట్టారా అని అడిగాడు సిద్దార్థ్, లేదు సార్ అతను మాస్క్ వేసుకున్నాడు సరిగా కనిపించలేదు అని చెప్పాడు గోవింద్. పై అధికారులు ఫోన్ చేసి కేస్ ఎంతవరకు వచ్చిందో డీటెయిల్స్ అడుగుతున్నారు. సిద్ధార్థ కేసు వివరాలు అన్ని చెప్తున్నాడు. ఎలా చేయాలో ఏం చేయాలో చెప్తున్నారు పై అధికారులు సరే సర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు సిద్దార్ధ్. అప్పుడే గోవింద్ ని పిలిచి ఈ టాబ్లెట్స్ మెడికల్ షాప్ లో ఇస్తున్నారో కనుక్కో అని చెప్పాడు సిద్దార్ధ్. సార్ అని చెప్పి వెళ్ళాడు గోవింద్ ప్రతి మెడికల్ షాప్ ని ఎంక్వైరీ చేస్తున్నాడు కానీ వాళ్ళు మాకు తెలియదు అని చెప్తున్నారు అప్పుడే గ్రేట్ సైకాలజిస్ట్ భరత్ గురించి తెలుసుకున్నాడు గోవింద్. ఎంతోమంది మానసిక రోగంతో బాధ పడుతూ ఉంటే వాళ్ళకి నయంచేశాడు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఆయన అంటే అందరికి అభిమానమే. ఎన్నో సేవలు మరెన్నో అవార్డులు సంపాదించుకున్నాడు సైకాలజిస్ట్ భరత్ అంటే ఎవరు తెలియని వాళ్లు ఉండరు. గీత తన ఫ్రెండ్స్ తో కాఫీ తాగడానికి హోటల్ కి వస్తాది. సిద్ధార్థ్ చాలా డల్ గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే  గీత సిద్ధార్థ ని చూసి హాయ్ సిద్దు ఎలా ఉన్నావు ఏంటి డల్ గా కనిపిస్తున్నావ్ అని అడిగింది గీత. గీత ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను. ఒక కేసు గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నాను అంతే అని చెప్పాడు సిద్దు. అవునా సరే నేను నా ఫ్రెండ్స్ తో వచ్చాను నువ్వు కావాలంటే జాయిన్ అవ్వు అని చెప్పింది గీత. లేదు ఒక ఫ్రెండు వస్తాను అన్నాడు అందుకే వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు సిద్దు. సరే నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను నేను, చెప్పింది గీత. సరే బై అని చెప్పాడు సిద్దు. ఒకే బై చెప్పి వెళ్ళిపోయింది గీత. ఒకరోజు సడన్గా గీత కనిపించింది తన ఇంటికి ఇన్వైట్ చేసింది కాఫీ కోసం సిద్ధూ ని. సరే అని గీత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సిద్దు. గీత కాఫీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్ళింది సిద్దు ఇల్లు మొత్తం చూస్తున్నాడు అక్కడ ఒక దగ్గర టాబ్లెట్స్ కనిపించాయి వెంటనే గీత..గీత… అని పిలిచాడు గీత కంగారుగా కిచెన్ నుండి వచ్చి ఏమైంది సిద్దు ఎందుకు పిలుస్తున్నావు అని అడిగింది. అది మీ ఇంట్లో ఈ టాబ్లెట్స్ ఎవరు వేసుకుంటున్నారు అని అడిగాడు సిద్దు. నేనే సిద్దు వేసుకునేది అని చెప్పింది గీత. ఇవి చాలా ప్రమాదకరమైన టాబ్లెట్స్ ఇవి వేసుకోవడం వల్ల మత్తులో ఉండి డిప్రెషన్ లోకి వెళ్లి కొన్ని రోజుల తర్వాత వాళ్లే ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాడు సిద్ధూ. అవును సిద్దు నువ్వు చెప్పేది నిజమే అందుకే వారం రోజుల నుంచి నేను వేసుకోవడం మానేశాను అని చెప్పింది గీత.. చాలా మంచి పని చేసావ్ గీత ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావ్ అని అడిగాడు సిద్దు. ద గ్రేట్ సైకాలజిస్ట్ భరత్ గారి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పింది గీత. వీళ్ళని ఎవరో గమనిస్తున్నారు అని అనిపించి చుట్టుపక్కల మొత్తం చూసాడు కొద్ది దూరంలో చూస్తే ఒకతను సిద్దు ని చూసి పారిపోతున్నాడు. అతని పట్టుకొని ఒక రూమ్లో బంధించి రేయ్ ఎవర్రా నువ్వు అని అడిగాడు సిద్దు. ఎంత కొట్టినా ఎవరనేది మాత్రం చెప్పట్లేదు దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఫస్టు ఉన్న నెంబర్ కి కాల్ చేశాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది గోవింద కి ఫోన్ చేసి నెంబర్ ఇచ్చాడు ఎవరిది ఏంటి అని కనుక్కోమని చెప్పాడు సిద్దు. గీత నువ్వు భరత్ దగ్గరికి వెళ్లి అన్ని తెలుసుకొని రావాలి ఏదో జరుగుతుంది, అది ఏంటో మనం తెలుసుకోవాలి గీత అని చెప్పాడు సిద్దు. సరే సిద్దు చెప్పి హాస్పిటల్ కి బయలుదేరారు ఇద్దరు. గీత భరత్ దగ్గరికి వెళ్లి నాకు మానసిక ఒత్తిడికి టాబ్లెట్స్ ఇచ్చారు కదా అవి చాలా మత్తుగా ఉన్నాయి. వేరేవి రాసి ఇవ్వండి అని చెప్తుంది గీత. సరే రాసిస్తాను నిన్ను కొంచెం టెస్ట్ చెయ్యాలి అని చెప్తాడు భరత్. సరే చెయ్యండి అని చెప్పింది గీత. ఓవర్ డోస్ ఉన్నా టాబ్లెట్ గీత కి ఇచ్చి అది వేసుకోమని చెప్తాడు భరత్. గీత సరే అని వేసుకుంటుంది కొద్దిసేపు తర్వాత తను పూర్తిగా మత్తులో కి వెళ్ళిపోతుంది.. తర్వాత తనతో సెక్స్ చేసి వదిలేస్తాడు ఒక నాలుగు గంటల తర్వాత గీత స్పృహలోకి వస్తాది. ఇలా అందరి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసి వాళ్లకి గర్భసంచి లేకుండా చేస్తున్నాడు. వాళ్లకి నిజం తెలిస్తే తన పేరు పరువు అన్ని పోతాయని భయంతో టాబ్లెట్స్ లో డ్రగ్స్ ఓవర్ డోస్ కలిపి ఇస్తాడు డాక్టర్ భరత్. ఇలానే అందరు అమ్మాయిల జీవితాలు నాశనం చేసి పేరు ప్రఖ్యాతలుసంపాదించుకున్నాడు డాక్టర్ భరత్. ఈ విషయం తెలిసిన సిద్ధూ డాక్టర్ భరత్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టి జీవిత ఖైదీ శిక్ష పడింది భరత్ కి డాక్టర్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేశారు. ఇలాంటి కిల్లర్ నీ చంప్పేయలి అని ప్రజలు గోల గోల చేస్తున్నారు. గీత సిద్దు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!