నమ్మకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు
ఆదివారం విహారాయాత్రలకు, వ్యాపారాలకు, పిల్లలు పెద్దల తో విశాఖపట్నం విమానాశ్రయం చాలా సందడిగా ఉంది. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఢిల్లీ కి బయల్దేరాడానికి సన్నద్దమౌతుంది. ప్రయాణికులు ఎంతో ఉత్సాహంతో బోర్డింగ్ చేసి లోపలికి వెళ్తున్నారు,ఎర్ హోస్టెస్ అందరికి సవినియంగా ఆహ్వానిస్తుంది. అందరూ తమ తమ సీట్లో కూర్చొని ఆనందం గా కబుర్లు చెప్పు కొంటున్న సమయంలో పైలట్ తనను పరిచయం చేసుకొంటూ మైక్ లో “మనం ఇప్పుడు వైజాగ్ నుంచి ఢిల్లీ కి 2 గంటల సమయం లో చేరుతాము, మీరందరు సహకరిస్తారని ఆశిస్తున్నాను”. అని పైలట్ చెప్పగానే అందరూ సంతోషం తో సీట్ బెల్ట్ లు బిగించుకొని తమ తమ కబుర్లు లో మునిగి పోయారు. విమానం గాల్లోకి ఎగరగానే అందరూ సంతోషంగా బెల్ట్ లు తీసేసి ఎయిర్ హోసైస్లు ఇస్తున్న టిఫ్ఫిన్స్ అందుకొని పిల్లల తో కూడా సరదాగా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా ఒక గంట గడిచాక విమానం కొంచెం కుదుపులు మొదలయ్యాయి, అందరూ కంగారు పడుతుండగా పైలట్ అనౌన్స్మెంట్ వచ్చింది, హలో, మీరెవరు కంగారు పడనక్కర్లేదు, తుఫాన్ కారణంగా వాతావరణం మారుతుంది, ఉరుములు, మెరుపుల వల్ల విమానం కుదుపులుకు గురవ్వతుంది, కొంచెం సేపు ప్రశాంతం గా ఉండండి ప్లీస్” థాంక్యూ అల్. అలాగే విమానం పక్క నుంచి మెరువులు పడ్తుండడంతో పాస్సెంజెర్ర్స్ కంగారు ఎక్కువై ఇదే చివరి క్షణాలు అనుకొంటూ బెంగతో పిల్లలని దగ్గరకు తీసుకొని భగవంతుని ప్రార్ధిస్తున్నారు. పైలట్ శతవిధాల ప్రయత్నిస్తూ విమానాన్ని కంట్రోల్ చేస్తున్న సమయంలో ఆక్సిజన్ మాస్క్ లు ఒక్కసారి తెరుచుకోవడంతో కంగారు మరింత ఎక్కువై , “ఏమైయ్యింది, మన పని అయ్యిపోయింది, అని అరుస్తూ ఏడుస్తూ ఒక్కసారి విమానంలోని వాతావరణం మారిపోయి అరగంటసేపు విపరీతమైన కుదుపులుతో భయానక పరిస్థితి ఏర్పడిన తన పక్క సీటులో కూర్చున్న ఒక 7 ఏళ్ల బాలిక మాత్రం అస్సలు కంగారుపడకుండా కిటికిలో కనపడుతున్న మెరుపులు చూస్తూ నవ్వకోవడం చూసి నిర్ఘాంతపోయాడు ప్రసాద్.
అలా విపరీతమైన కుదుపులతో ప్రయాణికుల గుండె ఆగినంత పనైనా ప్రసాద్ కి అంతుపట్టని విషయం తన పక్కనే కూర్చొన్న చిన్న అమ్మాయి ఎలాంటి భయం లేకుండా ఎలా ఉంది అని.
కొంచెం సేపు అయ్యాక మళ్ళీ సాధారణ ప్రయాణం వచ్చేసరికి అంత ఊపిరి పీల్చుకుని దేముడుకి కృతజ్ఞతలు తెలిపారు. విమానం క్షేమంగా ల్యాండ్ అయినతర్వాత ప్రసాద్ తన పక్కనే కుర్చొన్న అమ్మాయిని ఆపి,”ఎమ్మా, విమానంలో అందరూ అంత ప్రాణభయంతో ఉంటే నువ్వు అస్సలు కంగారు పడకుండా ఎలా ఉన్నావు? అని అడగ్గా ” ఆ అమ్మాయి నవ్వుతూ, అంకుల్ నాకు భయం లేదు ఈ విమానాన్ని నడపుతుంది ‘మా నాన్నగారు ‘ఎట్టి పరిస్థితుల్లోను ప్రమాదం జరగదు ఆ నమ్మకం నా కుంది, మా నాన్నగారు ఎలాంటి కష్ట మైన అధిగమిస్తారు, ప్రయాణికుల క్షేమం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తారు, కనుకే నేను అస్సలు భయపడలేదు”. ఆని అనగానే ప్రయాణికులంతా ఆ అమ్మయిని పైలట్ ను ఒక్కసారిగా కరతాళధ్వనుల మధ్య సగౌరవంగా సాగనామ్పారు. ఆ అమ్మాయి కున్న , నమ్మకం ప్రతి మనిషి లో ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చిన ఆ భగవంతుని మీద నమ్మకంతోనే మనం సాగిపోవాలి.