దారి చూపిన దేవత

దారి చూపిన దేవత

రచన: చెరుకు శైలజ

పని మనిషి పుష్ప రాలేదు. ఏం చేయాలి. గిన్నెలు అన్ని కడగడానికే వున్నాయి. వంట ఏలా చేయాలి. పల్లవికి విసుగ్గా వున్నది.ఏమిటో? రాకుంటే రావడం లేదు.అని ఫోన్ చెయ్యొచ్చు కదా! తను చెస్తే ఎత్తడం లేదు. గిన్నెలు కడగడానికి సిద్ధమైంది. భాస్కర్ బాత్రూమ్ నుండి అప్పుడే స్నానం చేసి బయటకు వస్తు పల్లవి అంటు పిలిచాడు. ఏమిటి? ఇప్పటికి పని మనిషి రాలేదు. అంటు గిన్నెలు కడుగుతూన్న చేతితోనే వచ్చింది.అయితే నాకు ఏం లంచ్ బాక్స్ అవసరం లేదు. బయట తింటాను.టీ తో,బిస్కెట్ తీని వెళ్లుతాను. నువ్వు మెల్లగా చేసుకో పని అన్నాడు.మీకు వద్దంటే నా పని తగ్గి పోతుందా, “ఎప్పటికైన నా పని నాకే వుంటుంది. కళ్యాణ్ లేస్తాడు.వాడికి టిఫిన్ చేసి ఇచ్చి బాక్స్ కట్టాలి.వాడిని కూడ బయట తినమని చెప్పు. నీవు మెల్లగా చేసుకో అన్నాడు. పల్లవి చేతులు కడుక్కొని భర్తకి టీ, బిస్కెట్స్ ఇచ్చింది. భాస్కర్ తినేసి ఆఫీస్ కి వెళ్లి పోయాడు . అబ్బా అంటు కూర్చోగానే అమ్మ టిఫిన్ బాక్స్ రడీ చేశావా? అంటు కొడుకు వచ్చాడు.లేదు .రా ,ఈ రోజు టీతో బిస్కెట్ తిని వెళ్లు.బయటనే లంచ్ చెయ్యి అంది. ఎందుకు ఒంట్లో బాగోలేదా అన్నాడు. పని మనిషి రాలేదు. గిన్నెలు కడిగి వంట చేయడానికి లేట్ అవుతుంది. పని మనిషిని మార్చు, మధ్య మధ్య ఇదే పరిస్థితి కదా! అన్నాడు. అదే అనుకుంటున్నా,అంది. కళ్యాణ్ రెడీ అయి ఆఫీస్ కి వెళ్లి పోయాడు.
. అప్పుడే ఏడుస్తూ పనిమనిషి పుష్ప వచ్చింది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్వు, పల్లవి అడిగింది. ఏం చెప్పాలమ్మా .మా ఇంటి పక్కల ఇరుగుపొరుగు వాళ్ళు నన్ను బతకనివ్వడం లేదు.నాపైన వాళ్ళకి అనుమానం మొగుడ్ని వదిలేసి అందరితో నేను తిరుగుతానని చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలు భరించలేక ,నాకు ఒక కొడుకు వున్నాడు. అని వాళ్ళకు తెరవాలని, నా కొడుకును హాస్టల్ నుండి ఇంటికి తీసుకొచ్చాను.అందుకే లేట్ అయ్యింది.ఏం చదువుతున్నాడు నీ కొడుకు ఏడవ తరగతి అంది.పదవ తరగతి వరకు అక్కడే వుంచితే బాగుండేది. నేను అట్లనే అనుకున్నామ్మ ,కాని అందరి మాటలు నన్ను పిచ్చి దానిని చేశాయి. వాళ్ళ మాటలు భరించలేక వాడిని ఇంటికి తీసుకొచ్చాను అంది.సరే,లే ఇప్పుడు అయిన ప్రశాంతంగా ఉండి పని చేసుకో అన్నాను .
ఒకనాడు దిగులుతో పనికి వచ్చింది. ఏమైంది? పుష్ప అలా వున్నావు. అమ్మ నా బతుకు ఇలా తలగపబడింది .నేను పని చేసే ఇంట్లో అమ్మ ఊరు వెళ్లింది. అయ్యగారు ఒకరే వున్నారు. పని చేసి వస్తుంటే ,నా చేయి పట్టుకొని లాగి, నన్ను రూం లోకి లాక్కెళ్లాడు. నేను అరుస్తుంటే ,నీకు ఏట్టాగు మొగుడు లేడు. ఇంకా ఎందుకే నీకి పట్టింపులు అన్నాడు. ఇంతలో ఎవరో బెల్ కొడితే తీసి తప్పించుకొని వచ్చాను.మా ఇంటి దగ్గర ఇంట్లో ఇద్దరే భార్యాభర్తలు వుంటారు. నన్ను ఒక గదిలో వుండమన్నారు.వాళ్ళకు ఇంట్లో పని చేయాలి. ఇక నేను రెంట్ కట్టనవసరం లేదు.అందుకే నాకు ఖర్చులు కలిసి వస్తాయి అని అక్కడే వుంటున్నాను. ఆ ఇంటి ఆయన కూడా అలాగే నాతో పిచ్చిగా మాట్లాడటం, అమ్మ గారు చూడనప్పుడు నన్ను కావాలని తాకడం ఏం చేయాలి? చాలా భయం గా ఉందమ్మ. అని చెప్పింది.అవును పుష్ప ఏం వయసులో వున్న ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. ఒంటరిగా ఆడది కనబడితే చాలు. ఈ మగవారికి అలుసు అయిపోయింది పల్లవి అంది.
పుష్పకి 30 ఏండ్లు వుంటాయి. పుష్పకి చిన్న వయసులోనే పెళ్లి చేశారు .అందుకే పెళ్లి అయి 13ఏండ్ల కొడుకు వున్నాడు. చూడడానికి చామనచాయగా వున్న మనిషి,మంచి కళగా వుంటుంది. ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా తన పని తను చేసుకొని వెళుతుంది.అయిన ఈ మనుషులు ఆమెని బతకనివ్వడం లేదు . పుష్ప తన ఇంట్లో పనికి కుదిరి మూడు నెలలు అయింది. ఎప్పుడు ఏది అడగదు.
. ఇస్తే నే తీసుకుంటుంది. కాని పుష్ప ఎప్పుడు విచారంగానే వుండేది. రెండు ఇండ్లు పని చేస్తూ నా దగ్గరకు వచ్చి అడిగింది. తను వేరే ఊరి నుండి ఈ మధ్య నే కొత్త గా సిటీ కి వచ్చానని, తన భర్త తనను వదిలి వెళ్ళిపోతే, తను తన కొడుకుని తీసుకుని ఇక్కడకు వచ్చానని, చెప్పింది.మేము కూడ అప్పుడే ఇల్లు కొనుక్కుని షిఫ్ట్ అయ్యాం. కాబట్టి పుష్పను చూస్తే నీట్ గా అనిపించింది. పనిలోపెట్టుకున్నాను. అందుకే పుష్ప మీద నాకు జాలి కరుణ కలిగాయి. జరిగిన విషయాలను పల్లవి
గుర్తుకు తెచ్చుకుంది. మధ్య మధ్య లేట్ గా పనికి వస్తున్న పుష్పను కోపం తో పనిలో నుండి తీసి వేద్దాం అని పల్లవి అనుకుంది. కాని పుష్ప జరిగిన విషయం చెప్పేసరికి తన నిర్ణయం మారుచుకుంది.”అంతా బాధ అనుభవిస్తున్న పుష్పకు ఏదో ఒకటి చెయ్యాలి ఆనుకుంది”..
మరునాడు పుష్ప పనికి వచ్చింది. నేను ఒకటి చెపుతాను చేస్తావా? అని పల్లవి అడిగింది. చెప్పండమ్మా, నా మంచికే చెపుతారు కదా! అంది. నువ్వు ఎంత వరకు చదువుకున్నావు అంది..నేను ఏడు వరకు చదివాను. తెలుగు బాగనే చదువుతాను.ఇంగీష్ కొంచెం కొంచెం చదువుతాను.సరే రోజు నువ్వు ఇండ్లలో పని చేసి ఇక్కడ కు రా,నేను చదువు చెపుతాను . “ఇప్పుడు చదువు నా బుర్రకు ఎక్కుతు తుందా? నాది అసలే మట్టి బుర్ర అంది. ఏం కాదు, రెండు మూడు రోజులు కష్టంగా వుంటుంది. “చదువుకు వయసుతో పని లేదు”. మంచిగా చదువుకొని పదవ తరగతి పరిక్ష ఫీజు కట్టి రాయి. అది అయిపోగానే డిగ్రీకి ఫీజు కట్టిస్తాను. అంతా డబ్బులు ఎక్కడి నుండి తేను అంది. నేను చూసుకుంటాను.నువ్వు మాత్రం రోజు ఒక గంట నా దగ్గర చదువుకోవాలి. చదువుకోవడం వలన నీకు ధైర్యం వస్తుంది. లోకం తీరు తెలుస్తుంది .మంచి ఉద్యోగం లభిస్తుంది.సంఘంలో నీకు మంచి గౌరవం పెరుగుతుంది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళకే నువ్వు మంచి జవాబు చెప్పవచ్చు. నిజంగానా! అంది. నీవు చేసి చూపెట్టాలి.మరి రేపు ఏం పట్టుకోని మీ దగ్గరకు రాను.నేను నోట్ బుక్ పెన్సిల్ ఇస్తాను.రేపు మొదలు పెట్టుదాం పల్లవి అంది.

రేపటి నుండి వస్తానమ్మ అని చెప్పి వెళ్లి పోయింది. పల్లవి కూడా యం బి.ఎ చదివింది.తను లాస్ట్ ఇయర్ వరకు జాబ్ చేసింది. కొత్త ఇంట్లోకి మారక మానేసింది. అందుకే జాబ్ విలువ, చదువువిలువ తనకి తెలుసు.
ప్రతిరోజు ఒక గంట పల్లవి చాలా ఓపికగా పుష్పకి చదువు చెప్పడం మొదలు పెట్టింది. మొదట కొంచెం అర్ధం కాక, నాకు ఈ చదువు గిదువు వద్దమ్మ, నా కొడుక్కి నేర్పండి అంది. మరి నీవు రోజు అలాగే ఏడుస్తూ ఇండ్లలో పని చేసుకుంటూ వుంటావా? అంది. నిజమే!అమ్మగారు “రోజు చస్తూ బతకలేను”. సరేనమ్మ చిత్తం తో వింటాను. ఏదైనా అర్ధం కాకుంటే అడిగేది, రాయడం రాకుంటే అది వచ్చె వరకు వెళ్లిది కాదు.పుష్ప పట్టుదల చూసి పల్లవికి సంతోషం వేసేది. పుష్పచే పదవ తరగతి పరీక్షలు రాయించింది. పదవ తరగతి పాస్ అయింది పుష్ప.
ఆ తరువాత పుష్పకి ఓపేన్ యునివర్సిటీ తెలుగు లాంగ్వేజ్ తో డిగ్రీ ఫీజు కట్టింది. ఒకేరోజు భాస్కర్ పల్లవితో చాలా మంచి పనే పెట్టుకున్నావు కదా! ఆమె చేసే పని నువ్వు చేసి మరి చదువు చెప్పెటట్లు వున్నావు. అన్నాడు.లేదండి, అన్ని పనులు చేసి ఎంతో ఓపికగా చదువుకుని పదవ తరగతి పాస్ అయింది. ఇప్పుడు డిగ్రీ మొదలు పెట్టించాను.నాకు నిజంగా ఆనందం గా వుంది .పుష్పకు ఒక ఉద్యోగం వచ్చెటట్టుగా చేస్తే నా కృషి ఫలించినట్టే పల్లవి అంది.
అమ్మ నీవు చేసింది గ్రేట్ట్ . ఆమె చదువుకోని ఉద్యోగం చేయడం వలన ఆమె సమస్యలు తీరిపోతాయా? అన్నాడు. మొత్తనకే తీరవు.కాని ఒక బలం వస్తుంది. చదువు వలన ఉద్యోగం వలన నలుగురు అండగా వుంటారు.ఆమెకి బయట ప్రపంచం అర్ధం అవుతుంది .తెలివిగా ఏ సమస్యా పైన ఎదురుకుంటుంది.కరెక్ట్ అమ్మ . నువ్వు చెప్పింది.
నా నుంచి ఏమైనా సహాయం కావాలా? కొడుకు అన్నాడు.ఏమి అవసరం లేదు. నేను చేసిన దానిని ప్రోత్సహిస్తే చాలు అంది. మా మంచి అమ్మ అంటు తల్లిని ముద్దు పెట్టుకు న్నాడు.
పుష్ప డిగ్రీ పరీక్షలు రాసి పాసైయింది డిగ్రీ అర్హత తో ఏదో జాబ్ అప్లై చేసింది. అందులో సెలెక్ట్ అయి ఉద్యోగం వచ్చింది.
పుష్ప ఆనందానికి అంతు లేదు. అంతా మీ వళ్ళనే అని స్వీట్ కొనుక్కుని వచ్చి ఇచ్చి పల్లవి కాళ్ళకి దండం పెట్టింది.. ఎందుకు? పుష్ప ఇవి అన్ని అంది. “మీరు నా పాలిట దేవత”.నాకు మంచి బ్రతుకు నిచ్చారు. అంటు కండ్ల నీళ్లు పెట్టుకుంది. ఇప్పటి నుండి దైర్యంగా, నీ పని నువ్వు చేసుకుంటు, నీ కొడుకుతో సంతోషం గా వుండు అంది.
భాస్కర్, కళ్యాణ్ పుష్పకు అభినందనలు తెలిపారు. అయ్యో నాది ఏముంది. “అంతా మన పల్లవమ్మ దయ అంది” .ఏదైనా నీ పట్టుదల కూడా వుంది.అని అన్నారు.
తెల్లవారి 6గంటలకే బెల్ చప్పుడు, ఇప్పుడు ఎవరు అబ్బా! అంటూ పల్లవి కన్నులు నలుసుకుంటు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా పుష్ప , ఏమిటే?”ఇంత పొద్దునే వచ్చావ్”. ఏమి సంగతి? అంది.”పని చేయడానికి అమ్మ అంది”. అది ఏమిటి? నువ్వు ఉద్యోగానికి వెళ్లవా! అంది. వెళతాను. మీకు అంతా పనిచేసి పెట్టి వెళుతాను అంది.
ఎందుకు? పుష్ప నేను వేరే ఎవరినైనా పెట్టు కుంటాను. ఎట్టా కుదురుతుంది. మా అమ్మ కి నేనే పని చేయాలా? నా రుణం. తీరుచుకోవాలా! అంది.ఏమిటి ?నీకు పిచ్చా అంది. ఏమైనా అనుకోండి మీరు.
నేను రోజు వచ్చి మీకు పని చేసి వెళుతాను. అలాగే అలవాటుగా అందరి ఇళ్ళలో చేస్తావా? నాకు దారి చూపిన మా దేవత ఇంటిలోనే చేస్తాను అంటు, పల్లవి చేయి పట్టుకొని తీసుకుపోయి సోఫాలో కూర్చో పెట్టి, మీరు ఇలా కూర్చోండి. నేను మీకు టీ పెట్టి ఇచ్చి , చకచకా పని చేసి వెళతాను అంది. అలా చెపుతున్నా పుష్పను నవ్వుతూ పల్లవి అలాగే చూస్తుండి పోయింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!