నిరీక్షణ

నిరీక్షణ

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

అనుకోలేదు నిను నేను చూసినపుడు
ఊహించలేదు నువు నన్ను కలిసినప్పుడు
భావించలేదు ఏవిధంగాను నిను నేను
కానీ ఇప్పుడు ఇప్పుడే ఎందుకో నీపై నాకు ఏదో అనిపిస్తుంది

నా తలపులలో నా ఊహాలలో
నా భావనలో నా తీరికసమయం లో
నా చేతలలో నా ప్రతీ పనిలో
నువ్వే నువ్వే గుర్తుకొస్తున్నావు

మరచిపోదామన్న నీ నవ్వు నను పలకరిస్తున్నట్లు
ఏదో పనిలోపడిన నీచేయి పెట్టి నన్ను తడుతున్నట్లు
నీ ధ్యాసకు దూరమవుదామన్న నీ పలుకులు పిలుస్తున్నట్లు

ముగ్దమనోహరమైన నీ ముఖవర్ఛస్సు
మృధువైన నీ శ్వేతవర్ణ తేజస్సు
మల్లెపూవు సుగంధ పరిమళం వెదజల్లునట్లు నీ గుభాళింపు
నను నిశ్చలంగా వుండనీక నిస్చేష్టుడను చేస్తుంది

ఏమైనా అందామనుకున్న
ఏమైనా చెప్పాలనుకున్న
ఏమవుతుందో పర్యవసానం అని
ఎటు దారితీస్తుందో అని

నా ఊహప్రపంచంలో నా ఊహసుందరిగా నిను ఉంచి నిరీక్షిస్తూ ఆరాధిస్తున్నాను
నీవే తెలుసుకొని నను కనికరిస్తావని నిరీక్షణ తో..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!