నా కథ 

నా కథ 

రచన:: తిరుపతి కృష్ణవేణి

కల్యాణిఈమధ్యనేకొత్తగా ఒక సాహితీ వేదిక వారు నిర్వహించే గ్రూపులో జాయిన్ అయింది. బుధవారం నుండి ఆదివారం వరకు కథలు రాయాలి అని గ్రూప్ వారు మెసేజ్ పెట్టారు.మొదటి నుండి కల్యాణికి బాలల కథలు అంటే చాలా ఇష్టం. పిల్లల అల్లరి, వారి ఆట పాటలు గమనిస్తూ, ఎంత సేపైనా చూస్తూఅలా వుండి పోయేది.
ఆ ఇష్టంతోనే ఉమ్మడి రాజధాని వున్నప్పుడు మంచి పేరున్న పత్రికకు పిల్లల కథలు రాసి పంపించటం జరిగింది.
ఆరోజుల్లోతన కథలు ప్రచురణ అయినప్పుడు కల్యాణి ఆనందం అంతా ఇంతా కాదు.ఆ తర్వాత చాలా వ్రాయటం వీలు కాలేదు.
ఆ కొద్ది అనుభవంతో ఇప్పుడు గ్రూవ్ లో చేరి ఎలాగైనా కథలు వ్రాయాలి అని కళ్యాణి నిర్ణయించుకున్నది.అలాంటి నేపథ్యంలో ఓ ప్రముఖ రచయిత్రి గారి ప్రోత్సహoతో గ్రూపులో జాయిన్ అయినది. రెండు మూడు కథలు వ్రాసింది. అందివచ్చిన అవకాశాన్ని వదులు కోవటం కళ్యాణికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ అవకాశాన్ని ఎలాగయినా సద్వినియోగం చేసుకోవాలి అనుకుంది.తన లాంటి కొత్త వాళ్ళకి మంచి అవకాశం కల్పించిన సాహితీ సంస్థ వారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది కల్యాణి. తనలాగాక్రొత్తగా రచనలు చేసే వారు చాలామంది ఈ గ్రూపులో ఉండి ఉంటారులే? అని భయం, బెరుకు లేకుండా కల్యాణి ధైయిర్యంగా రాయటం మొదలు పెట్టింది. రెండు, మూడు కథలు రాసిన తర్వాత,కల్యాణికి రోజు రోజుకు తనని తాను మెరుగు పరుచుకోవాలి అనే పట్టుదల మొదలయింది.ఎందుకంటే మిగతా వారి కథలు చదువుతుంటే చాలా అద్భుతంగావ్రాస్తున్నారు. వాటి ప్రేరణతో నేను వ్రాయటంలో మెలుకువలు నేర్చుకోవాలి అనే తపన మొదలైనది.ఎప్పుడూ అంతగా తెలుగు టైపు చేయని తను ఇప్పుడు,చాలా తొందరగా టైపు చేయకలుగుతూంది. మెసేజ్ లు, పంపకలుగుతూంది.ఏ రోజు అయినా రాయలేక పోతే మనసంతా ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత పని వున్నా ఎదైన రాయాలి , చుట్టు ప్రక్కల వారి ఇళ్లలో జరిగే సంఘటనలను గుర్తు చేసుకొని మంచి కథలుగా మలచుకొని వ్రాయటం చేస్తూంది. కానీ ఇప్పుడలా కాదు వుదయం లేసిందంటే ఈరోజు టాస్కు ఏమి ఇ చ్చారో అని ముందు ఫోన్ చూసినా తరువాతే ఏ పని అయినా చేస్తూంది, ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చు కుంటున్న కల్యాణి పరిస్థితి.ఈసారి అయినా తప్పులు లేకుండా రాయాలి అని మనసులోనే గట్టిగా నిర్ణయించు కొని కథ రాయటానికి ఉపక్రమించింది కల్యాణి.ఇంతలో ఫోన్ మ్రోగింది. ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం కలిసిన ఓ స్నేహతురాలు, ఈరోజు
ఉదయమే హైదరాబాద్ నుండి వచ్చాను,
అన్నయ్య వాళ్ళ ఇంట్లో దిగాను. టిఫిన్ కి మీ ఇంటికి వస్తాను. అని,కల్యాణికి ఒక్కసారి బి. పీ పెరిగింది. ఈ రోజు సాయింత్రానికి కథ పంపాలి. ఆమె వస్తే ఎలాసాధ్యం అవుతుంది? మా ఫ్రెండ్ అసలే వదరుబోతు? ఈ టైములో రాకుండా ఉంటే బాగుండును? అనిపించింది కానీ రావద్దని చెప్పలేముకదా! ఎక్కడ బాధ పడతారో!ఏమో! అని కల్యాణి బాధ.
పిల్లల్ని గద్ధించటానికి కూడా
ఇష్ట పడని తను అలా వచ్చిన ఆకస్మిక అతిథులను ఏమి అనగలను చెప్పండి.? పోనీ ఇంట్లో లేను అని చెపుదామంటే ఊర్లో దిగింది. వస్తే దొరికి పోతాను గదా? పోనీ తర్వాత రావే అంటే ఏమనుకుంటుందో? అలా చెప్పలేను?ఎప్పుడు నోరు విప్ప గలుగుతానో? మనసులోనే తనను తాను తిట్టుకుంది కళ్యాణి.రాణి,కల్యాణి మొదటి నుండి స్నేహితులే!కల్యాణిది మధ్య తరగతి కుటుంబం, రాణి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది. మంచి హోదాగల కుటుంబం, అందుకేనేమో రాణి మాటల్లో డబ్బు, గర్వం కొట్టొచ్చినట్లు కనిపిస్థాయి. ఎప్పుడయినా కల్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళినా,తను ఇక్కడికి వచ్చినా,చీరలు నగల విషయం తప్ప వేరే మాట్లాడేది కాదు?ఈ పరిస్థితిలో తమ ఊరిలో ఉన్న తన అన్నయ్య ఇంటికి వచ్చింది రాణి. అప్పుడే వచ్చిన తను అక్కడ ఏమి జరిగిందో ఏమో కల్యాణికి ఫోన్ చేసింది. వద్దంటే బాగోదు అని కల్యాణి భర్త రమ్మని చెప్పారు. ఆ విషయం లోనే కళ్యాణికి కోపం వచ్చింది. వాళ్ళ బంధువుల ఇంట్లో ఉండకుండా పిల్లలతో ఉన్న మాఇంటికి రావాలనుకోవటం నచ్చలేదు.పైగా జోరీగలా మాట్లాడుతున్న రాణి మాటలు నచ్చటం లేదు.
ఈ రోజు కథ పెట్టలేక పోతున్నాను అనే బాధ మనసులో మొదులుతూంది.ఎందుకు మనుషులు ఇలా వుంటారు స్పృహ అనేదే వుండదా? రెండు రోజులు ఆగి రావచ్చు గదా, వచ్చిన రోజే ఇక్కడికి రావాల్నా? ఏమిటి నీకేమైనా మతి వుందా అని అనాలని వుంది కానీ, గొంతు దాటి ఏ ఒక్క మాట కూడా రాదాయే! పోనీలే ఏమయినా రాసుకుందాము అంటే వదురు బోతు అయిన రాణి మాటలే జోరిగలా ఆ చెవి నుండి ఈ చెవికి వినిపిస్తున్నాయి. అసలే అంతంత మాత్రమే అయిన నాకు ఇక బుర్ర ఏమి పని చేస్తుంది చెప్పండి. ఈరోజు నేను కథ పెట్టలేక పోతున్నా ననే బాధ కళ్యాణి మనసులో మొదులుతూంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!