అన్నదాత సుఖీభవ
రచన: నామని సుజనాదేవి
కంటికి కనిపించని కరోనా ధాటికి కకావికలైన
కర్షకులు కూడుకోసం కూటి కోసం
కరువైన ఆరోగ్యం కోసం
కరువును తప్పించడానికి
కాడి ఎద్దులను కడుపుతీపి చంపుకుని
కాసులకు అమ్మేసుకుంటే
కాడి మోయడానికి కర్షక దంపతులే దిక్కయ్యారు
కన్నకొడుకే రధసారధి అయితే
కాడి నెత్తుకున్న వాళ్ళు
శిలువ మోసిన ఏసు ప్రభువులా ఉన్నారు
చదువుకునే వయసులో
తప్పనిసరై పొలం దున్నుతున్న బాబు
భువన భోనాంతరాలు ఆక్రమించిన
వామనుడిలా శోభిస్తున్నాడు
శ్రమయేవ జయతే అని
కష్టేఫలి అని కన్నపేగు చెప్పిన
పాఠాలను ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నాడు
కరోనా అనగానే ఎవరూ
కారు కొనడానికో , ప్రయాణానికో పరుగెత్తలేదు
అందరూ వెళ్ళింది అన్నదాత
పండించిన ధాన్యం కోసం
అందరూ దాచుకుంది
ప్రాణాలు దక్కించే దాన్యాన్నే
అందుకే అన్నదాత సుఖీభవ
అన్న నోర్లు వారికి సాయం చేయాలి
***