చిరుత

చిరుత

రచయిత: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

అదో జీడిమామిడి తోట.కూలీలంతా జీడిమామిడి గింజలను గ్రేడింగ్ చేసి బాక్సుల్లో నింపుతున్నారు.అదేసమయంలో ఏదో పెద్ద శబ్ధమైంది.ఏంటా శబ్ధమని వెళ్ళి చూసే సరికి ఒక కొండచిలువ చిరుతపులి నడుముకి చుట్టుకొని బిగిస్తూ ఉండడంతో పులి అరుస్తూ ఉంది.కూలీలకు ఏం చేయాలో అర్థం కాలేదు.రెండూ క్రూర జంతువులే కావడంతో పులిని కాపాడాక కొండచిలువ ఎదురు తిరిగి,పులి కూడా ఎదురు తిరిగితే అని ఆలోచనలో ఉన్నారు.ఓనర్ వరాహమూర్తి వచ్చి కూలీలంతా తోటలో లేరని వెతుకుతూ వచ్చి”ఏరా సోములూ ఏం జరిగింది ఏంటా గుంపంతా “అన్నాడు.ఏం లేదు సామీ కొండ సిలవొకటి పులిని చుట్టేసింది ఏం సెయ్యాలో అర్థం కాక సూస్తా ఉండాం “అన్నాడు సోములు.ఒరేయ్ దానికేనా మీరు వెళ్ళి పని చూసుకోండి వాటి సంగతి నేను చూసుకుంటా అంటూ వాళ్ళని పంపేసి కాసేపటికి వరాహమూర్తి కూడా వచ్చి జీడిగింజల్ని లోడెక్కించాడు.తర్వాత కాసేపు కూలీలకు కన్పించకుండా ఎటో వెళ్ళిపోయాడు.కూలీలందరూ కూలీ కోసం ఎదురు చూస్తూ ఉండి పోయారు.వరాహమూర్తి చాలా సేపు రాలేదు.చిరుతపులి అరుపులు భయంకరంగా విన్పిస్తున్నాయి.సోములు “ఒరేయ్ ఓనరు నేను సూసుకుంటా పోండి అని మనల్ని పంపించేసి ఆయన ఏం చేయనట్టున్నాడు ఆ కొండసిలవ చిరుతపులి ప్యాణాన్ని పొట్టనబెట్టుకున్నట్టుంది “అంటూ చెట్టు పైకి చూశాడు.గట్టిగా అరిచేశాడు.చెట్టుమీద చిరుతపులి సోములు మీదకి దూకేయబోతుండగా కూలీలల్లోనే ఉన్న వీరిగాడు రాయితో గట్టిగా ఒక్కటేశాడు.పులి నేలక్కరుచుకుంది.దారాలతో దాని కాళ్ళు కట్టేసి గోతంలో వేసి చెట్టుకి తగిలించి వరాహమూర్తి కోసం వేచిచూస్తూ ఉన్నారు.రానే వచ్చాడు.ఏరా ఇంటికి పోలేదా అన్నాడు.వీరిగాడు “ఏమయ్యా ఇంతసేపు రాలేదు. మీకోసమే ఉన్నామయ్యా కూలీ ఇస్తే బయలుదేరుతాం”అన్నాడు.ఆ కొండ చిలువ పులి గొడవ తీర్చబోయి నేనే ఇరుక్కున్నానురా అందుకే లేటు అనడంతో సోములు ఏం జరిగిందయ్యా అన్నాడు.”ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేశా.వాళ్ళు వచ్చి కొండచిలువనుంచి పులిని కాపాడారు.కొండచిలువను వలలో బంధించారు. పులి ని బంధించబోయేటప్పటికి తప్పించుకొంది.దాన్ని ఇప్పటి దాకా వెతికి వెతికి మీరు గుర్తొచ్చి వచ్చా .ఇంకా ఫారెస్ట్ వాళ్ళు వెతుకుతున్నారు.ఊరిమీదకెళ్తే ఇబ్బంది కదా .దాన్ని కూడా బంధించి రెండిటినీ దూరంగా అడవిలో వదిలేయాలంట.అది దొరికే వరకూ నన్నూ ఉండమన్నారు.ఎరక్కపోయి ఇరుక్కున్నానురా సోములూ “అంటూ నిష్ఠూరపోయాడు వరాహమూర్తి.వీరిగాడు అయ్యా మీరేం టెన్షన్ పడబాకండి.ఫారెస్టోళ్ళని కేకేయండి పులి ఇక్కడే ఉంది అన్నాడు.వరాహమూర్తి ఎగిరి కుర్చీ ఎక్కి ఎక్కడరా నాయనా అన్నాడు.ఇదిగో సామీ అంటూ సోములు గోతాంలో కట్టిపడేసిన చిరుతను చూపించడంతో భయం భయంగానే వరాహమూర్తి ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేశాడు.వాళ్ళు వచ్చి దానిని వలలో బంధించి తీసుకెళ్ళారు.దాంతో ఊపిరి పీల్చుకున్న వరాహమూర్తి ఆనందంతో కూలీలకు కొంత ఎక్కువ సొమ్ము ముట్టజెప్పాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!