కొంగ్రొత్త వేకువ

కొంగ్రొత్త వేకువ

రచన: మక్కువ. అరుణకుమారి

బడిగంటల మోతలకు మురిపెం ఎక్కువ
బుజ్జాయిల నడకల్లో ఆత్రం ఎక్కువ
గురువులను,దోస్తులను కలవాలనే కోరిక ఎక్కువ
ఆట,పాటలతో గడపాలనే ఆశలు ఎక్కువ
గోరుముద్దలు తినాలనే తొందర ఎక్కువ

తల్లి, దండ్రులకు పిల్లల భద్రతపై తపన ఎక్కువ
వారి భవితపై తగని మక్కువ
చిట్టి పాపకు భద్రత ఎక్కువ
బుజ్జి బాబుకు భయం తక్కువ

కానరాని కరోనాకు కరుణ తక్కువ
భయం మీరి దానిని చేయోద్దు లోకువ
రక్షణ తంత్రాలు వాడేద్దాం అణకువ
సామాజిక దూరం పాటిద్దాం మెలకువ
బంగారు భవితకు తెచ్చేద్దాం కొంగ్రొత్త వేకువ

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!