మూగ జీవాలు

మూగ జీవాలు

రచన::రవిబాబు బొండాడ

చీమకు పంచదార
పాముకు పాలు పోసెడి దేశాన
నాలుగు వేదాల సాక్షిగా
నాలుగు పాదాల జీవులు
ఆకలితో అల్లాడుతున్న వి
మా వేదన పట్టదా అని ప్రశ్నిస్తున్నవి

మనిషీ ఆ ఆవుకి ఓ అరటి పండు
కాసింత గరిక అందివ్వ లేవా ?
పాలు పిండుకోడానికి గడ్డేయడం
కోసుకు తినడానికి మేతేయడం
స్వార్ధమే గా

మనిషీ స్వార్ధం విడిచి చూడు
కిచకిచలాడే ఆ గుప్పెడు పిట్టకు
గుక్కెడు నీరందించలేవా ?
పర్యావరణమూ , వరమే
ఆవరం మూగ జీవాలకు శాప మొందు కవ్వాలి ?

ఆకలి అందరికీ ఆకలే
అది పేగులు మెలి పెడుతుంది

ఆమెలిక
ఆకలి
ఆకలి , ఆకలియుగదైవమే తీర్చాలా
మనమూ తీర్చగలం
ఆ పశువుల ఆకలి గుర్తించక పోవడానికి
మనం పశువులం కాదు కదా…
ఒక్క క్షణం ఆలోచించండి ..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!