అహంభావం

అహంభావం

రచన::సావిత్రి కోవూరు 

పుడమి నేలిన పురుషులెందరో – విర్రవీగిరి  అవనిలో
అంబరమును భువికీ దించిరా – చుక్కలను కోసి తెచ్చిరా
సూర్యచంద్రుల ప్రభలనే తగ్గించిరా – మేఘములను తుంచిరా
జన్మ గుట్టును విప్పిరా – మనిషి మెదడును చదివిరా

కడలి చలనము ఆపిరా – కాలమును ఆప గలిగిరా

విశ్వమంతానిండి ఉండిన – విశ్వాత్మకుడిని చూసిరా

మరణమును ఆపగలిగిరా –  మర్మమేమో ఎరిగిరా

దిక్కులను తిప్పగలిగిరా – దివిని చూడా గలిగిరా

జగతి నెల్ల ప్రజ్వరిల్లు –  స్వార్థమును మాపగలిగిరా

పాపపుణ్యాలు ఎరగనట్టు – ప్రాణుల సృష్టి చేసి రా

అవని అంతా నాకే అంటూ – రణము చేసిన రాజులెల్లరు

రాలిపోక ఆగిరా – రాశినంత గొని పోయిరా

మారణ హోమాలు చేసిన – మహారాజులెక్కడ పోయిరి
మచ్చుకైనా కానరాక – మట్టిలో కలిసి పోయిరి.

చక్రవర్తిని నేనే అంటూ చాతి విరిచిన వీరులంతా
అంత నాది నాది అంటూ – ఆస్తులు ఎన్నో కూడబెట్టి,

ఆలి అంటూ, పిల్లలంటూ –  ఆత్మబంధం పెనవేసిన,

కలసి నడచిర, తుదకు నీతో –   ఆస్తులు అయినా, ఆత్మీయులైన

You May Also Like

One thought on “అహంభావం

  1. చాలా బాగుంది.ఈ జీవిత సత్యం అర్థం చేసుకుంటే అంతా సంతోషమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!